పొరపాట్లు ఎప్పటికైనా ప్రమాదమే..డబ్బు కాజేసి, అత్యాచారం !

Wednesday, March 14th, 2018, 01:11:37 PM IST

తెలిసి తెలియని వయసులో చేసిన కొన్ని పొరపాట్లు ఎప్పటికైనా జీవితానికి ప్రమాదమే అని రీసెంట్ గా జరిగిన ఒక ఘటన ఉదాహరణగా నిలిచింది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఇలాంటి దారుణాలు చాలానే జరుగుతున్నాయి. భయంతో అనుకువగా ఉండే అమ్మాయిలను కొంత మంది బ్లాక్ మెయిలింగ్ చేస్తూ డబ్బు గుంజుతున్నారు. అంతే కాకుండా వారిని లైంగికంగా వేధిస్తున్నారు కూడా. అదే తరహాలో రీసెంట్ గా గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. అయితే చివరికి బాధితురాలు షి టీమ్ ను సంప్రదించడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.

అసలు వివరాల్లోకి వెళితే.. మానవపాడు మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన రెడ్డిపోగు రవి(31) కొన్నేళ్ల క్రితం తనతో పాటు పదవతరగతి చదువుకున్న బాలికతో స్నేహం ఏర్పరచుకున్నాడు. అయితే అతని అసలు బుద్ది గురించి తెలుసుకున్న ఆ అమ్మాయి అతన్ని దూరం పెట్టింది. 2014లో ఆమెకు వివాహం జరిగింది. భర్త ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా ఉన్న ఆమె జీవితంలోకి మళ్లీ రవి ప్రవేశించాడు. 2017లో ఆమె ఫోన్ నెంబర్ ని సంపాదించి ఆమెని మోసం చేయాలనీ ప్లాన్ వేశాడు.
ఆమెకు తెలియకుండా అప్పట్లో తీసిన నగ్న పోటోలను మొబైల్ కి పంపి తరచు వేధించేవాడు.

తనకు డబ్బు ఇవ్వకుంటే ఫొటోలు భర్తకు చూపిస్తానని అలాగే ని బిడ్డలను కిడ్నప్ చేస్తాను అని బెదిరించాడు. భయపడిన బాలిక భర్తకు తెలియకుండా రెండు లక్షల వరకు ఇచ్చింది. అంతటితో ఆగని ఆ వ్యక్తి అత్యాచారం చేయడానికి కూడా ప్లాన్ వేశాడు. ఫోటోలని తన ముందే డిలీట్ చేస్తాను అని నమ్మించి కల్వకుర్తి దగ్గర ఉన్న ఓ దేవాలయం దగ్గరికి రమ్మన్నాడు. అతన్ని నమ్మి వెళ్లిన ఆ యువతికి చేదు అనుభవం ఎదురైంది. నిర్మానుషమైన ప్రదేశంలో అత్యచారం జరిపాడు. అనంతరం బాదితురాలు షీ టీమ్ ని ఆశ్రయించడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.