ప్రేమికుడి ముందే ప్రేయసిని పొదల్లోకి లాక్కెళ్లిన రాక్షసులు

Thursday, October 19th, 2017, 09:54:36 AM IST

ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వాలు పోలీసులు మహిళల రక్షణ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇంకా వారిపై దాడులు ఏ మాత్రం ఆగడం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట మహిళలపై కొందరు రాక్షసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. రీసెంట్ గా ఇదే తరహాలో ఒడిశాలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. గుడికి వెళ్లిన ప్రేమికులపై కొందరు అమానుషంగా ప్రవర్తించారు.

అసలు వివరాల్లోకి వెళితే..ఒడిశాలోని గంజాం జిల్లా భంజానగర్ కు చెందిన యువతీ డిగ్రీ చదువుతోంది. తను ప్రేమించిన యువకుడితో ఆమె బుధకెందు తాకూరాణి దేవాలయానికి వెళ్లింది. అయితే ప్రేమికులు పూజ చేసి వస్తుండగా రెండు బైక్ లపై ఆరుగురు యువకులు వచ్చి వారిని అడ్డగించారు. ప్రేమికుడిని దారుణంగా కొట్టి యువతిని పక్కన ఉన్న పొదల్లోకి తీసుకెళ్లారు. సామూహిక అత్యాచారం చేసి ఆ ఘటన దృశ్యాలని ఫోన్లలో చిత్రీకరించారు. ఆ తర్వాత వారిని అక్కడ వదిలేసి వారు పారిపోయారు. దీంతో బాధితులు ఘటన అనంతరం సమీపాన ఉన్న పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఆరుగురి నిందితులను అరెస్ట్ చేశారు.