అడవిలో యువతి యువకుడిపై స్నేహితుల వికృత చేష్టలు!

Monday, April 2nd, 2018, 12:03:48 PM IST

దేశం వివిధ రంగాల్లో ఎంత అభివృద్ధి చెందుతుండడంతో మనిషి కూడా కాలానికి తగ్గట్టుగా మారుతున్నాడు అని అర్ధమవుతోంది. పోటీ ప్రపంచంలో బ్రతకడానికి ప్రతి ఒక్కరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ కొంత మంది మంత్రం ఇంకా నేరాలు చేసుకుంటూ అడ్డ దారుల్లో డబ్బు సంపాదిస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇటీవల కొంత మంది యువకులు ఓ యువతి యువకుడిపై అమానుషంగా ప్రవర్తించడం హాట్ టాపిక్ అయ్యింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఎలాంటి పొలిసు కేసు నమోదు కాకపోవడం గమనార్హం.

ఒక యువకుడు యువతి ఇటీవల తన కృష్ణపట్నం పోర్టు రోడ్డు మీదుగా వచ్చి సమీపాన ఉన్న ఇడిమేపల్లి రోడ్డు చెట్లలోకి వెళ్లారు. పక్కనే చెట్టుకింద మోటారు సైకిల్‌ను పార్క్ చేసి వెళ్లారు. అయితే వారు అలా వెళ్లిన విషయాన్ని గమనించిన ఓ ముగ్గురు యువకులు వారి వద్దకు వెళ్లారు. మొదట వారిని ప్రశ్నించడం జరిగింది. ఎందుకు వచ్చారు అని ఫొటోలు వీడియోలు తీశారు. అంతటితో ఆగకుండా యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. మేము ఇద్దరం స్నేహితులమని చెప్పినా వారు వినలేదు. దీంతో తమ వద్ద ఉన్న డబ్బు తీసుకొని వదిలేయమని పోకిరీలను ప్రాధేయపడ్డారు.

అంతే కాకుండా పోటోలను డిలీట్ చేయాలని యువతి యువకుడు చెప్పారు. అయితే ఆ గ్యాంగ్ వారి వద్ద ఉన్న 7 వేల రూపాయలను తీసుకొని ఇంకా కావాలని డిమాండ్ చేశారు. దీంతో యువకుడు తన దగ్గర ప్రస్తుతం లేవని చెప్పి తన వెంట స్వగ్రామానికి వస్తే ఇస్తానని చెప్పాడు. తన స్నేహితురాలిని దారిలో వదిలేసి బాధితుడు డబ్బును డిమాండ్ చేసిన వ్యక్తితో తన ఊరికి వెళ్ళాడు. అక్కడ తన బందువులకు సన్నిహితులకు జరిగిన విషయాన్ని చెప్పడంతో బెదిరింపులకు పాల్పడిన యువకుడిని బాధితుడి బంధువులు చితకబాదారు. అంతే కాకుండా మిగతా వ్యక్తుల వద్దకు కూడా వెళ్లి వారి గ్రామంలో గొడవకు దిగారు. వెంటనే పోటోలను డిలీట్ చేయాలనీ చెప్పడంతో గ్రామస్థులు కలుగజేసుకొని గొడవను పరిష్కరించినట్లు సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments