నగరంలో మాయలేడి.. పట్టుకుంటే 25వేలు!

Thursday, May 31st, 2018, 11:37:35 AM IST

ప్రస్తుతం దొంగల తెలివితేటలు చూస్తుంటే మంత్రాలు చేసేవారు కూడా ఆశ్చర్యపోతారు. మ్యాజిక్ కూడా వారి ముందు పనికి రాదు. మనిషిని ఎలా లోబరచుకోవాలి అనే ఆలోచన వారికి అప్పటికప్పుడే ఎలా పుడుతుందో గాని చాలా చాకచక్యంగా దొంగతనాలు చేసేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో ఒక మాయలేడి సంచరిస్తోంది అని పోలీసులు చెబుతున్నారు. మెల్లగా మహిళలలను మాటల్లో పెట్టిబంగారం కొట్టేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. రీసెంట్ గా కేపీహెచ్ బి లో జరిగిన ఒక ఘటన అందరిని ఆందోళనకు గురి చేసింది. రెండుసార్లు మేకప్ అని చెప్పి నగలతో ఉడాయించిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.

అసలు మ్యాటర్లోకి వెళితే.. ఈ నెల 19న కేపీహెచ్‌బీ కాలనీ 6వ ఫేజ్‌లో మాధురీ బ్యూటీ పార్లర్‌లో మేకప్‌ లో కోసమని ఒక మహిళ వచ్చింది. అయితే యజమాని దగ్గర బంగారం ఉందని ముందే పసిగట్టిన మహిళ పక్క ప్లాన్ తో దిగింది. బంగారం తీసేసి మేకప్ చేయాలనీ కోరడంతో నిర్వాహకురాలు నగలను తీసేసి బీరువా లో భద్రపరచించి. అనంతరం మాయలేడి మెల్లగా ఆ యువతిని మాటల్లో కలిపి ఒక మత్తు మందు బిల్లతో స్పృహ కోల్పోయేలా చేసింది. ఆ తరువాత నగలతో అక్కడి నుంచి ఉడాయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రత్యేక బలగాలతో గాలిస్తున్నారు. గతంలో కూడా అదే ప్రాంతంలో మరో చోట ఇదే విధంగా ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక మాయలేడిని సిసి ఫుటేజ్ ద్వారా గుర్తించిన పోలీసులు పోటోలను రిలీజ్ చేశారు. ఆ మాయలేడి ఆచూకీ తెలిపిన వారికి 25 వేల నగదు బహుమతి ఇస్తామని కూడా పోలీసులు తెలిపారు.