ప్రశ్నించిన మహిళలు- తడబడ్డ లోకేష్

Friday, January 11th, 2019, 03:25:07 PM IST

మరోసారి ఏపీ మంత్రి నారా లోకేష్ కి చేదు అనుభవం ఎదురైంది. మహిళలు లోకేష్ ని నిలదీశారు… మంచినీటి పథకాన్ని ప్రారంభించడానికి పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి వచ్చిన మంత్రి లోకేష్ ను అక్కడి మహిళలు నిలదీశారు. ఇప్పటికి కూడా మేము నివసిస్తున్న ఐదవ డివిజన్లో మంచి నీరు రావడంలేదు. కనీసం రోడ్డు సౌకర్యాలు సరిగా లేవు అని అక్కడి మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాకుండా పలువురు తమ తమ సమస్యలపైనా ఆందోళన వ్యక్తం చేయడంతో మంత్రి లోకేష్ అర్థాంతరంగా సభను ముగించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దీంతో ఆందోళన చేపట్టిన గ్రామస్తులు లోకేష్ కి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు.