వావ్..వుమెన్స్ ఐపీఎల్ కూడా ఉంటుందట?

Monday, February 26th, 2018, 09:15:49 PM IST

భారతదేశంలో అత్యంత ఆధారణ పొందిన ఆటలో క్రికెట్ ఒకటని అందరికి తెలిసిన విషయమే. కాలం మారుతున్న కొద్దీ క్రికెట్ ఆటలో కూడా మార్పులు చాలానే వచ్చాయి. ముఖ్యంగా ఐపీఎల్ వచ్చాక క్రికెట్ అభిమానులు ఇంకా చాలా ఎక్కువయ్యారు. ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు ఆటగాళ్లకు అలాగే క్రికెట్ బోర్డులకు కాసుల వర్షం కురుస్తోంది. వేల కోట్ల బిజినెస్ జరుగుతోంది. ఈ సారి జరగబోయే ఐపీఎల్ చాలా ప్రత్యేకమైనది. 11వ సీజన్ కోసం బిసిసిఐ చాలా స్పెషల్ గా ఏర్పాట్లను చేసింది. పైగా చెన్నై – రాజస్థాన్ జట్లు కూడా బరిలోకి దిగడంతో అంచనాలు పెరిగాయి.

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఆ మధ్య ఉమెన్స్ ఐపీఎల్ కూడా నిర్వహించాలని అందరి నుంచి పిలుపు వచ్చింది. మహిళా క్రికెటర్స్ కూడా మేన్స్ తరహాలోనే ఐపీఎల్ ఉమెన్స్ లీగ్ ని నిర్వహించాలని తెలియజేశారు. అయితే బిసిసిఐ మరి అంత పెద్ద స్థాయిలో కాకపోయినా ముందుగా కొన్ని మ్యాచ్ లను నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు సమాచారం. ఎపిఎల్ 11 ఏప్రిల్ 7న స్టార్ట్ కానుంది. అయితే భారత్ తో పాటు ఇంగ్లాండ్ – సౌత్ ఆఫ్రికా మహిళ క్రికెటర్లను కలగలిపి నాలుగు జట్లను ఏర్పాటు చేయాలనిక్ అనుకుంటున్నారట. అన్ని అనుకున్నటుగా జరిగితే ముందుగానే వుమెన్స్ ఐపీఎల్ ఉండనుందని సమాచారం.