హైదరాబాద్ లో దారుణం.. పార్టీకి పిలిచి మైనర్ పై అత్యచారం!

Saturday, September 1st, 2018, 10:48:32 AM IST

పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా హైదరాబాద్ లో ఇంకా అరాచకాలు దర్శనమిస్తున్నాయి. రీసెంట్ గా పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. బర్త్ డే పార్టీ అని చెప్పి స్నేహితురాలిపై అత్యాచారం జరిపారు. తీవ్రకలకాలం సృష్టించిన ఈ ఘటనతో స్థానికులు భయానికి గురవుతున్నారు. ఇక ఈ పార్టీలో ముజ్రా డ్యాన్స్ లతో కొంతమంది యువతులు అసబ్యకరంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి వారిని రక్షించి నిర్బయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

అసలు వివరాల్లోకి వెళితే.. బర్త్ డే పార్టీ అని చెప్పి ఖుద్దూస్ అనే వ్యక్తి కాలాపత్తర్ లోని మయూరీ లాడ్జీకి ఆహ్వానించాడు. ఇక ముజ్రా పార్టీ అంటూ హడావుడి కూడా చేశాడు. ముగ్గురు అమ్మాయిలు, ఆరుగురు యువకులు పార్టీకి వచ్చారు. కొద్దీ సేపటి తరువాత పార్టీలో భాగంగా అమ్మాయిలకు మత్తు మందు కలిపిన డ్రింక్స్ ఇచ్చారు. ఓ మైనర్ అమ్మాయి వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఖుద్దూస్ అత్యాచారం చేశాడు. ఇక ముజ్రా డ్యాన్సులు నిర్వహిస్తున్నారు అని పక్క సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు యువతులను ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అత్యచారానికి పాల్పడిన ఖుద్దూస్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అదే విధంగా హోటల్ ను సీజ్ చేసి ఓనర్ పై కూడా కేసు నమోదు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments