వింత : రెండు తలల మగ శిశువు జననం

Saturday, April 14th, 2018, 10:17:25 AM IST

సాదారణంగా రెండు శరీరాలు అతుక్కుని పుట్టడమో, లేక ఉండాల్సిన వాటికంటే కాలి వేళ్ళు గానీ, చేతి వేళ్ళు గానీ అదనంగా వచ్చి పుట్టే శిశువుల గురించి మనం చూసి వినీ ఉంటాం, కానీ ఇక్కడ ఓ వింత జరిగింది. ఇటివల షోలాపూర్‌ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఆస్పత్రిలో గురువారం ఓ మహిళ రెండు తలల శిశువుకు జన్మనిచ్చింది. బుధవారం ఆ మహిళ ప్రసూతి కోసం స్థానిక శివాజీ మహారాజ్‌ ఆస్పత్రిలో చేరారు. కాన్పునకు ముందు వైద్యపరీక్షలు నిర్వహించగా రెండు తలలతో శిశువు ఉన్నట్లు గుర్తించారు. వైద్యులు శస్త్రచికిత్స చేశారు. మగ శిశువుకు రెండు తలలు, ఒకే శరీరం, 2హృదయాలు, 2శ్వాసకోశాలున్నాయని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం చిన్నారికి బాలల అత్యవసర వైద్యకేంద్రంలో చికిత్సఅందజేస్తున్నారు. ఇప్పుడా శిశువుకి ఆపరేషన్ చేసి ఒక తల తొలగించడమా లేక అలాగే ఉంచి కావాల్సిన వైద్య చికిత్సలు చేయించడమా అన్న విషయంపై డాక్టర్లు చర్చలు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మిగితా విషయాలు తెలియాల్సి ఉన్నాయి.