అదిరిపోయే వజ్రాల హార్లీ బైక్ చూశారా..

Thursday, May 17th, 2018, 12:38:46 PM IST

సాదారణంగా అందరికీ బైక్ కొనుక్కోవాలని ఉంటుంది, కానీ హార్లీ డేవిడ్ సన్ బైక్ కొనుక్కొని తిరగాలని చాలాతక్కువ మంది అనుకుంటారు. ఎందుకంటే అది చాలా ఖరీదైన వాహనం కాబట్టి. అంతే కాకుండా ఈ బైక్ కి విదేశాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రూజ్ అమెరికా, స్విస్ వాచ్ కంపనీలు కలిసి సంయుక్తంగా ఈ బైక్ ను రూపొందించాయి. ఈ బైక్ గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నాం ఎందుకు అనుకుంటున్నారా.. చెప్తా వినండి. ఎప్పుడూ ఉండే బైక్ లకంటే దీనికి మరింత క్రేజ్ పెంచేందుకు వజ్రాలతో తయారు చేశారట. బైక్ ని వజ్రాలతో తయారు చేయడం ఇంతా అనుకుంటున్నారా..? అవును మరీ ఇంట స్పెషాలిటీ కలిగిన ఈ బైక్ ని తయారు చేయడానికి క్రూజ్ కంపనీ ఇంజనీర్లకు 2500 గంటలు సమయం పట్టిందట.

ఎంత మెషినరీ టెక్నాలజీ వచ్చినా చేతితో చేసిన వస్తువులకు విలువేక్కువ అన్నట్టు ఈ బైక్ లో వాడిన ప్రతీ లోహాన్ని చేతితోనే తయారు చేసి ప్రత్యేకంగా పాలిషింగ్ చేశారట. అంటే కాదండోయ్ ఈ బైక్ లో మొత్తం నీలి రంగులో ఉండటం ఒకటయితే దానికి వజ్రాలు పొడిగించడం వల్ల మరింత ఆకర్షనీయంగా కపిపిస్తుంది. ఈ నీలి రంగు స్పెషాలిటీ ఏమిటో తెలుసా ఆరు రంగులను మిక్స్ చేసి ఒక సీక్రెట్ కోటింగ్ ప్రక్రియ ద్వారా ఈ ప్రత్యేక రంగును తరాయు చేసి బైక్ కి కోటింగ్ వేశారు. మరో గొప్ప విషయం ఏమిటంటే థ్రాటెల్ వాల్వ్ లను బంగారంతో చేయబడిన ప్లేట్లతో రూపొందించడంతో ఈ బైక్ ఒక డిఫరెంట్ లుక్ తో ఆకర్షిస్తుంది. చివరికి ఈ బైక్ సీటు కూడా చేతితోనే చాలా బలంగా కుట్టించారట.

అన్నిటికీ మించి ఈ బంగారు బైక్ కు బుకెరర్ వాచ్ ను కూడా జతపరచారు. బైక్ ఇంజల్ సహాయంతో ఈ వాచ్ ఎడతెరపి లేకుండా ఎప్పటకీ పనిచేస్తూనే ఉంటుంది. వాచ్ పాడవడానికి వీలు లేకుండా సిలికాన్ రింగులతో ద్యంపార్ సిస్టం ని కూడా అమర్చారట. తాజాగా జరిగిన జ్యురిచ్ ఈవెంట్లో ఈ బైక్ ను ఆవిష్కరించారట. ఈ బైక్ గురించి ఇన్ని చెప్తున్నాం మరి దీని ధర ఏంటో చెప్పలేదు కదూ రూ. 13 కోట్లు విలువ కలిగిన ఈ బైక్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బైక్ గా చరిత్ర సృష్టించింది.