కఠిన నిర్ణయం తీసుకోవాలనుకున్నా..సచిన్ ను తొలగించేవారిమే..!

Thursday, September 22nd, 2016, 03:05:29 PM IST

sachin-g
భారత మాజీ చీఫ్ సెలెక్టర్ సందీవ్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓ దశలో తాము సచిన్ ను సైతం తొలగించాలనుకున్నామని అన్నారు.2012 లో భారత వన్డే జట్టు నుంచి తాము సచిన్ ను తొలగించాలనుకున్నట్లు తెలిపారు. ఆ సమయంలో ఓ మరాఠీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సందీప్ పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

2012 లో సచిన్ ను తన భవిష్యత్ కార్యాచరణ గురించి అడిగామని అన్నాడు. ఆ సమయం లో సచిన్ టీం లో కొనసాగుతానని చెప్పడంతో సెలక్షన్ కమిటీ అతనినిర్ణయాన్ని గౌరవించింది అని తెలిపాడు. అనంతరం మరో సమమావేశంలో సచిన్ తన వన్డే రిటైర్మెంట్ ను ప్రకటించాడని తెలిపారు.ఆ సమయం లో సచిన్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోకుంటే ఖచ్చితంగా వేటు వేసేవారిమని సందీప్ పాటిల్ అన్నాడు.అదే జరిగి ఉంటె తన నాలుగేళ్ళ పదవీకాలం లో అత్యంత కఠిన నిర్ణయంగా ఉండేదని అన్నారు.