నన్ను డబ్బులు తీసుకుని ఓడిపొమ్మన్నారు

Friday, August 23rd, 2013, 04:26:31 PM IST

Untitled-26 copy
ఫిక్సింగ్ బూతం కేవలం క్రికెట్ కి మాత్రమే పరిమితం కాదు. అన్ని క్రీడల్లోను దాని జాడలు కనిపిస్తునే ఉన్నయి.భారత్ కు ఒలింపిక్స్ లో రెండు సార్లు వరసగా పతకాలు సాదించి పెట్టిన సుషీల్ కుమార్ తాజాగా ఓ సంచలన విషయాన్నీ బయట పెట్టాడు . 2010 మాస్కో లో జరిగిన వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీలో తనను డబ్బులు తీసుకుని ఓడిపోమ్మనారట . టైమ్స్ అఫ్ ఇండియా కధనం ప్రకారం ఫైనల్ కు కొద్దిసేపు ముందు సుషీల్ కుమార్ ప్రత్యర్ది అలెన్ గొగయెవ్ తనతో మాట్లాడాలని అంటున్నాడని అతని సహయాక సిబ్బంది ద్వారా కబురు పంపుతాడు. విషయం మొత్తం చెప్పి కొన్ని కోట్లు తనకి ఆఫర్ చేస్తే దానికి నిరాకరించి అతన్ని 3-1 ఓడించానని తెలిపాడు . అది 2 కోట్లా 3 కోట్లా అనేది విషయం కాదని అది గౌరవానికి సంబందించిన విషయం అని సుషీల్ కుమార్ పత్రికకు తెలిపాడు .