మొదటి స్థానాన్ని అందుకున్న షియోమీ..శాంసంగ్‌ డౌన్!

Thursday, January 25th, 2018, 11:40:47 AM IST

ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్స్ లేని వారు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పవచ్చు. ఏ పని అయినా చిటికెలో జరగాలంటే చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. మనిషికి స్మార్ట్ ఫోన్ ఎదో ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉంది. అయితే గత కొంత కాలంగా ఇండియాలో చాలా స్మార్ట్ ఫోన్ కంపెనీలు అడుగుపెట్టయి. అంతే కాకుండా గడిచిన ఐదేళ్లలో టెక్నాలజీ బాగా అప్డేట్ అవ్వడంతో కొన్ని కంపెనీలు తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్స్ ని అందిస్తూ.. బడా కంపనీలకు గట్టి పోటీని ఇస్తున్నాయి.

అయితే గత కొన్నేళ్లుగా శాంసంగ్‌ కంపెనీ అత్యధిక ఆదరణ పొందుతున్న మొబైల్ కంపెనీగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే దాన్ని తలదన్నేలా చైనా సంస్థ షియోమీ అత్యధిక మొబైల్స్ అమ్మి రికార్డ్ సృష్టించి నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంది. రీసెంట్ గా ప్ర‌ముఖ మార్కెట్ రీసెర్చీ సంస్థ కౌంట‌ర్‌పాయింట్ రిలీజ్ చేసిన నాలుగో త్రైమాసికంలో గత ఏడాది స్మార్ట్‌ఫోన్ విప‌ణిలో శాంసంగ్ వాటా 23 శాతానికి పడిపోగా షియోమీ మాత్రం 25 శాతనికి పెరిగింది. ముందు కూడా ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. ఆ తరువాత లెనెవో ఒప్పో వివో సంస్థ‌లు ఇంతకుముందుకంటే వాటి స్థానాలను కొంచెం మెరుగుపరుచుకున్నాయి.