వైఎస్ జగన్..! పవన్ ని చూసి నేర్చుకో.. జనసేన కో ఆర్డినేటర్.!

Thursday, September 13th, 2018, 12:45:24 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో నిన్న భారీగా జనసేనలో ఇతర పార్టీల నుంచి చేరికలు జరిగిన విషయం తెలిసందే. సామాన్య ప్రజలే కాకుండా వైసీపీ పార్టీ నుంచి కూడా చాలా మంది జనసేన పార్టీ లో సభ్యత్వం పొంది జనసేన కండువా కప్పుకున్నారు. అదే నేపధ్యంలో జనసేన కో ఆర్డినేటర్ రాజబాబు వైఎస్ జగన్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు..

వారి అధ్యక్షుడు ఐన పవన్ కళ్యాణ్ మీద ఇతర రెండు పార్టీల వారు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, అంతే కాకుండా జనసేన పార్టీ మీద కుల ముద్ర వెయ్యాలని చూస్తున్నారని తెలిపారు. మొన్న ఇచ్చిన పార్టీ టికెట్ విషయం లో కూడా ఒక సారి గుర్తు తెచ్చుకోవాలి అని అడిగారు. ఎవరైతే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారో వారికి మరియు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి కూడా ఒక ఛాలెంజ్ విసిరారు, వారి పార్టీలలో 18,19 ఎమ్మెల్సీ లను నియమించుకున్నారు వారిలో ఒక్క దళిత సోదరుడైన ఉన్నాడా? ఎందుకు నియమించుకోలేదు అని అడిగారు. అంతేకాకుండా కొన్ని రిసేర్వ్ద్ నియోజక వర్గాల్లో దళితుల యొక్క ఆర్ధిక పరిస్థితి తెలిసి కూడా కూడా ఎవరైతే 5 నుంచి 10 కోట్లు ఖర్చు పెట్టె నాయకులకి సీట్లు కేటాయిస్తున్నారని, మండిపడ్డారు. దీన్ని బట్టి మీకు దళితుల పట్ల ఎంత ప్రేమ ఉందో అని నిలదీశారు. రాజకీయాలు ఎలా చేయాలో,ప్రజల పట్ల నిబద్ధతో ఎలా ఉండాలో, పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకొండి అని ఎద్దేవా చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments