కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం..

Thursday, May 17th, 2018, 11:16:46 AM IST

ఈ రోజు కర్నాటక రాజ్ భవన్ మరో సారి యడ్యూరప్ప గళంతో దద్దరిల్లింది. రాష్ట్రం ఆనంద కేళిలో మునిగి తేలింది. ఎందుకంటారా కర్ణాటక రాష్ట్ర 23వ ముఖ్య మంత్రిగా యడ్యూరప్ప ఈ రోజు ఉదయం9 గంటలకు ప్రమాణ స్వీకారం చేసాడు. అంతే కాకుండా కర్ణాటక రాష్ట్రానికి యడ్యూరప్ప సీఎంగా గెలవడం ఇది మూడవసారి అంటే ఆషామాషీ కాదు. ఈ రోజుల్లో ప్రజలు ఒక నాయకున్ని 3 సార్లు తమ రాష్ట్ర నాయకునిగా ఎన్నుకోవడం విశ్లేశాత్మక విషయం అని చెప్పవచ్చు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వెలువడ్డ ఫలితాల ప్రకారం బీజేపీకి 104 స్థానాలు రాగా రాష్రంలో అది అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే రెండవ స్థానంలో కాంగ్రేస్ పార్టీ 78 స్థానాలలో ఉండగా జేడీసీ 38 స్థానాలను కైవసం చేసుకొని మూడవ స్థానంలో నిలిచింది. ఫలితాలు వెలువడ్డ తర్వాత బీజేపీని నిలబడకుండా చేసేందుకు ప్రయత్నం చేసిన కాంగ్రెస్ జేడీఎస్ తో చేతులు కలిపి జేడిఎస్ అధినేత కుమార స్వామిని సీఎం కుర్చీ ఎక్కించడానికి మద్దతును తెలిపింది.

దీని విషయమై రాష్ట్రంలో తమ మహా కూటమి ఏర్పరచుకోవడానికి గవర్నర్ సమ్మతించాలని కోరారు. ఇదిలా ఉంటే అటు బీజేపీ కూడా పెద్ద పార్టీగా అవతరించిన తమకే మద్దతు పలికి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రోత్సహించాలని గవర్నర్ ను కోరింది. రెండు రోజులుగా ఎవఋ రాష్ట్ర సీఎం అవుతారా అన్న విషయంపై కీలక నిర్ణయం తీసుకున్న గవర్నర్ నిన్న అసలు సీఎం అవరా అన్న విషయాన్ని బహిర్గతం చేశారు. ఎక్కువ స్థానాలలో కేంద్ర పార్టీ బీజేపీ ఉన్నందున వారికే ప్రభుత్వ ఏర్పాటుకు పిలుపునిచ్చారు. అంతే కాకుండా శానన సభలో తమ బలనిరూపణ చేసుకోవడానికి 15 రోజుల గడువు కూడా ఇచ్చారు. చివరికి కర్ణాటక రాష్ట్ర 23వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసి సీ ఎం గద్దేపైకి ఎక్కి కూర్చున్నారు.