బ్రేకింగ్ న్యూస్ : ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడుతున్న యడ్యూరప్ప ఆడియో రికార్డు లీక్

Saturday, May 19th, 2018, 03:38:18 PM IST

భాజాపాపై ఉక్కుపాదం మోపిన కాంగ్రెస్ మెల్లగా పావి కోసం చేస్తున్న కుట్రలు బయట పెడుతుంది. తమ బలనిరూపణ పరీక్ష రుజువు చేసుకోవడానికి సమయం దగ్గర పడుతుండటంతో భాజాపా తప్పుడు పనులకు పాల్పడుతుందని ఆరోపణలు వ్యక్తం చేసింది. బీజేపీ అసెంబ్లీ పక్ష నేత, కర్ణాటక రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన యడ్యూరప్ప తన పదవిని నిలుపుకోవడానికి ప్రతిపక్ష నేత అయిన బీసీ పాటిల్ తో బేరం ఆడుతున్న ఆడియో టేపు ఒకటి ఇప్పుడు సంచలనం రేపుతుంది. తనకు మద్దతు ఇస్తే నీకు మంత్రి పదవి కట్టబెట్టి నీకు ఎప్పటికీ ఎలాంటి సమస్య రాకుండా నేను అండదండగా ఉంటానని యడ్యూరప్ప ఫోన్ కాల్ లో మాట్లాడిన ఆడియో రికార్డ్ కాంగ్రెస్ బయట పెట్టింది. కాంగ్రెస్ తమ దగ్గర ఇదొకటే ఆడియో టేపు కాకుండా మరో ఎమ్మెల్యేతో మాట్లాడిన ఆడియో కూడా ఉందని అదే యడ్యూరప్ప కొడుకు కూడా బేరం మాట్లాడిన ఆడియో కూడా ఉందని దాన్ని కూడా కొద్దిసేపటి క్రితం బయట పెట్టింది. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఇప్పటివరకూ దాదాపు 10 మందితో బీరసారాలు చేసారని, దానికి సంబందించిన అన్ని సాక్ష్యాదారాలు తమదగ్గర ఉన్నాయని తెలిపింది.

కాంగ్రెస్ తెలిపిన ఆధారాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ నుండి ఏడుగురిని, జేడీఎస్ నుండి ఒకరిని, మరియు ఇండిపెండెంట్లు గా గెలిచినా మర్తో ఇద్దరితో కూడా మాట్లాడి వారికి ఆకర్షణీయమైన ఆఫర్లు ఇచ్చి వాళ్ళని భాజాపా వైపుకు తిప్పుకున్తున్నారని, ఇది చట్టరీత్యా నేరమని దీన్ని చూస్తూ సహించేది లేదని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. భాజాపా బేరసారాలు చేసిన వారిలో కాంగ్రెస్ తరపున ఆనంద్ సింగ్, ప్రతాప గౌడ, నారాయణ రావు, రాజశేఖర్ పాటిల్, మహాతేజా, హోళగిరి, బయ్యాపూర్ అమెరాగాదాలు, కాగా జేడీఎస్ నుండి వెంకట రావు నడగడ, మరియు ఇండిపెండెంట్లు నరేష్, శంకర్ లు ఈ జాబితాలో ఉన్నారని తెలిసింది.

అయితే ఈ రోజు ఉదయం 11 గంటల నుండి మొదలైన ఎమ్మెల్యేల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం 3 గంటలవరకు కొనసాగగా ప్రోటెం స్పీకర్ బోయ్యాం 210 మందితో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రస్తుతం శాసన సభా మండలిని వాయిదా వేశారు. తిరిగి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు యడ్యూరప్ప బలనిరూపణ పరీక్షతో శాసన సభ మొదలవనుంది.

  •  
  •  
  •  
  •  

Comments