జగన్ పై పలు వాఖ్యలు చేసిన యనమల – కారణం అదేనా…?

Friday, June 7th, 2019, 01:02:53 AM IST

టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై పలు సంచలన వాఖ్యలు చేశారు. చంద్రబాబు రాసిన లేఖను జగన్ రాజకీయంగా చూడటం సమంజసం కాదని, అది కేవలం ఇద్దరిమధ్య ఉన్నటువంటి సత్సంబంధాల వలననే రాసారని యనమల అన్నారు… కాగా ఈ మేరకు యనమల ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు రాసిన లేఖపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి చేసిన వాఖ్యలని ఖండిస్తున్నామన్నారు… అంతేకాకుండా చంద్రబాబు రాసిన లేఖను ప్రజాసమస్యలపై రాసారు అని అనడం హాస్యాస్పదం అని అన్నారు. అయితే ఇది మొదటి లేఖ కాదని, ఈ విషయం కూడా తెలియకుండా విజయసాయి రెడ్డి మాట్లాడటం కరెక్ట్ కాదని అంటున్నారు యనమల… మే 30నే ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్మోహన్‌ రెడ్డికి అభినందనలు చెబుతూ లేఖ రాశారని చెప్పారు.

అబద్దాలు చెప్పడమే అలవాటుగా మార్చుకున్న వైసీపీ నేతలు ఇప్పటికి కూడా అబద్దాలు చెబుతున్నారని, ఇప్పటికైనా మారాలని యనమల సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారపక్షం పాత్ర కన్నా ప్రతిపక్షం పాత్ర అధికంగా ఉంటుందని, చంద్రబాబు కోరింది ప్రజావేదికను కార్యాలయ అవసరాలకు ఇవ్వాలని కోరటంతో ఎలాంటి తప్పు లేదని, ఈ విషయాన్నీ వైసీపీ నేతలు గమనించాలని యనమల కోరాడు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలతో భేటి అయ్యేందుకు, వారి ఇబ్బందులు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ఇది దోహదపడుతుందనే చంద్రబాబు కోరారని, దీన్ని రాజకీయంగా చూడటం, వ్యంగ్యంగా మాట్లాడటం తగదని అన్నారు.