పట్టు కోల్పోయిన మంత్రి – రాజకీయ పతనమే..!

Saturday, November 10th, 2018, 11:49:45 AM IST

యనమల రామకృష్ణుడు, టీడీపీ ఆవిర్భావం నుంచే పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు. ఎన్టీఆర్ హయాం నుండి ఇప్పటివరకు చాలా సార్లు ఏపీ శాశన సభకు ప్రాతినిధ్యం వహించారు. ఒకానొక దశలో తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగారు, ఆ జిల్లాలోని తుని నియోజకవర్గం నుండి ఆరు సార్లు పోటీ చేసి గెలుపొందారు. 2004లో మెజారిటీ తగ్గినప్పటికీ, ఆయనే గెలిచారు. అయితే 2009లో యనమలకు గట్టి ఎదురు దెబ్బే తగిలింది, కాంగ్రెస్ నేత చేతిలో ఓటమి ఎదుర్కొన్నారు. తర్వాత చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రోత్సహించారు.

2014లో జరిపిన సర్వేల్లో యనమలకు, అయన కుటుంబానికి ఎదురుగాలి వీస్తుందని తెలిసినప్పటికీ, చంద్రబాబు దైర్యం చేసి ఆయనమల కుటుంబానికే టికెట్ కేటాయించారు, కాగా యనమల సోదరుడు కృష్ణుడు ఘోర పరాజయం చవి చూసాడు. ఇక ఇప్పుడు మరో ఆరు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు రానుండటం తో టీడీపీ టికెట్ ఎవరికీ కేటాయించాలి, యనమల కుటుంబం పరిస్థితి ఏంటి? టికెట్ కేటాయిస్తే గెలిచే పరిస్థితి ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకప్పుడు తిరుగులేకుండా దూసుకుపోయిన యనమలకు ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అన్న చర్చ జరుగుతుంది. నిజానికి పరాజిలు ఎన్ని ఆశలు పెట్టుకొని యనమల కుటుంబానికి అధికారం కట్టబెట్టారు, అయితే యనమల ఫామిలీలో కుటుంబ రాజకీయాలే ఆయన పతనానికి దారి తీస్తున్నాయని పలువురు అభిప్రాయం పడుతున్నారు. ప్రజల సమస్యలు గాలికి వదిలేసి, అధికార దర్పం వెలగబెట్టడం, అందినకాడికి బేరసారాలు చేయటం, పూర్తిగా ప్రజలతో సంబంధాలు మానుకొని రాజకీయ ప్రయోజనాలే ద్యేయంగా ముందుకు సాగటం వంటి పరిణామాలు అయనను ప్రజాక్షేత్రం లో ఒంటరిని చేసాయని విమర్శలున్నాయి. అలా అయన ఎంతో కష్టపడి నిర్మించుకున్న రాజకీయ ప్రస్థానం ఇపుడు మచ్చుకైనా కనిపించటం లేదు. వచ్చే ఎన్నికల్లో అయన కూతురుని రంగంలోకి దింపినా కూడా సానుభూతి ఏర్పడి గెలిచే అవకాశం కూడా లేదు అంటున్నారు పరిశీలకులు, మొత్తంమీద యనమల రాజకీయ ప్రస్థానం ఒక పాఠం.