ఎన్నిక‌ల టైమ్‌లో.. ఎంత పెద్ద రిస్క్ చేశాడో.. హ్యాట్స‌ప్ జ‌గ‌న్..!

Monday, February 11th, 2019, 03:33:57 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవితంలోని పాద‌యాత్ర అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని తెర‌కెక్కిన చిత్రం యాత్రం. మ‌ల‌యాళం మెగాస్టార్ మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో మ‌హి వి రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం విడుద‌ల అయిన అన్ని కేంద్రాల్లో హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.

పొలిటిక‌ల్ నేప‌ధ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కినా, ఎలాంటి కాంట్ర‌వ‌ర్సీ సీన్స్, రెచ్చ‌గొట్టే డైలాగ్స్ లేకుండా తెర‌కెక్కించ‌డంతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తోంది యూత్రి సినిమా. క‌లెక్ష‌న్ల ప‌రంగా కూడా దూసుకుపోతున్న ఈ చిత్రం పై సినీ విశ్లేషకులు సైతం ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. తాజాగా ఈ చిత్రం పై వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పందించారు. ఒక మ‌హానాయ‌కుడి జీవిత క‌థ‌ని బాగా తెర‌కెక్కించినందుకు అభినంద‌న‌లు తెలిపారు. చిత్ర యూనిట్‌ని త‌న ఇంటికి పిలిపించుకుని మ‌రీ వారి పై ప్ర‌శంస‌లు కురిపించారు. అయితే చిత్ర యూనిట్ సినిమా చూడ‌మ‌ని కోర‌గా.. త‌ప్ప‌కుండా త్వ‌ర‌లోనే చూస్తాన‌ని తెలిపారు.

ఇక తాజాగా ఇంట‌ర్వ్యూలో భాగంగా యాత్ర డైరెక్ట‌ర్ మ‌హి వి రాఘ‌వ్ కొన్ని ఆశ‌క్తిక‌ర విష‌యాలు తెలిపారు. మ‌హానేత‌ రాజశేఖరరెడ్డి గారి జీవిత చరిత్రను తెర‌కెక్కించే అవ‌కశం ఇచ్చిన జగన్ అన్నకు, ఆయన కుటుంబానికి రుణపడి ఉంటానని మ‌హి వి రాఘ‌వ్ అన్నారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ సినిమాలో ఏదైనా తేడా జ‌రిగి ఉంటే.. కుటుంబం మొత్తం న‌ష్ట‌పోయేవార‌ని, అయినా జ‌గ‌న్ అన్న త‌న‌పై న‌మ్మ‌కం ఉంచార‌ని, అదే ఆయ‌న గొప్ప‌త‌న‌మ‌ని మ‌హి వి రాఘ‌వ్ అన్నారు. ఇక ఎలాంటి అంచ‌నాలు లేకుండా తెర‌కెక్కిన ఈ సినిమా క‌లెక్ష‌న్లు ప‌రంగా కూడా దూసుకుపోతుంది.