మూవీ రివ్యూ : యాత్ర

Friday, February 8th, 2019, 03:57:03 PM IST

తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్నటువంటి బయోపిక్ ల పరంపరలోని భాగంగా మరో మహనీయుని యొక్క జీవిత చరిత్రపై ఒక సినిమా తెరకెక్కింది.అదే మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం “యాత్ర”. మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే టీజర్,ట్రైలర్లతో మంచి స్పందనను రాబట్టి ఏక కాలంలో తెలుగు,తమిళ్ మరియు మలయాళం భాషల్లో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పుడు ఈ సినిమా ఎంత వరకు విజయాన్ని సాధించిందో సమీక్ష లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే కథానాయకుడు దివంగత రాజశేఖర్ శేఖర్ రెడ్డి(మమ్ముట్టి) అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నటువంటి 2004 ఎన్నికల్లో చేసిన మహాయాగం 68 రోజుల పాదయాత్ర కోసం తెరకెక్కించబడింది.తన సుదీర్ఘ ప్రయాణంలో రాజకీయనాయకునిగా మొదలై ప్రజల్లో గుండెల్లో కొలిచే స్థాయికి ఏ విధంగా ఎదగగలిగారు.తాను చేసిన యాత్రలో ప్రజల నుంచి రైతుల నుంచి ఎలాంటి సమస్యలను తెలుసుకున్నారు.వాటిని ఏ విధంగా ఎదుర్కొనగలిగారు.అలా ఎదుర్కొని ఆయన పార్టీలో తిరుగులేని నాయకునిగా ఎలా మారారో తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

ఈ సినిమా మొదలు కావడమే వైఎస్సార్ చిన్ననాటి జీవితం మరియు ఆయన వృత్తి రీత్యా సంబంధిత జీవితానికి సంబంధించిన టైటిల్ కార్డ్స్ తో ఆసక్తికరంగా మొదలవుతుంది.అలాగే వై ఎస్ పాత్రలో మమ్ముట్టి కరెక్ట్ గా కుదిరారు.పార్టీ కన్నా పార్టీ పెద్దలకన్నా తనకి ప్రజలే ముఖ్యం అనే సీన్లు వైఎస్సార్ ను ఎలివేట్ సీన్లు,మరీ ముఖ్యంగా తాను పాదయాత్ర చేస్తానని ప్రకటించే సన్నివేశాలు థియేటర్ లో ప్రేక్షకులను వైఎస్ అభిమానులను మరింత కట్టి పడేస్తాయి.అలాగే వైఎస్ తండ్రి పాత్రలో జగపతి బాబు అలాగే సభితా ఇంద్రా రెడ్డి పాత్రలో సుహాసినీలు అద్భుత నటనను కనబర్చారు..రైతుల సమస్యలను రాజశేఖర్ రెడ్డి ప్రధానంగా రైతుల సమస్యలను తెలుసుకుంటూ మంచి భావోద్వేగ పూరితంగా సినిమా అంతా కొనసాగుతుంది.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి పలికించిన హావభావాలు కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆయన పండించిన నటన ప్రధానాకర్షణగా నిలుస్తాయి.

ఇక దర్శకుని పని తీరుకి వచ్చినట్టయితే సినిమా నిడివి చిన్నది కావడం వలన నిర్విరామంగా కథ మొత్తం మంచి ఫ్లో లో వెళ్తుంది.దీని వల్ల ఎక్కడా కథ పక్కదారి పట్టినట్టుగా అనిపించదు.ఈ విషయంలో దర్శకుని ఆలోచనా తీరుకి పనితనాన్ని మెచ్చుకొనే తీరాలి.కాకపోతే సెకండాఫ్ లో అక్కడక్కడా కథ ఎంగేజింగ్ గా సాగుతున్నట్టు అనిపించొచ్చు.దీనిపై దర్శకుడు కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది.కానీ ఈ సీన్లు వైఎస్సార్ ను ఎలివేట్ చేసే సీన్ల ముందు తేలిపోతాయి.అలాగే ఈ సినిమా మమ్ముట్టి వన్ మ్యాన్ షో గా చెప్పొచ్చు.రియల్ లైఫ్ లో రాజశేఖర్ రెడ్డి హీరోగా ఆయన భుజల పై మోసారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అలాగే మహి వి రాఘవ్ ఎంచుకున్న ఈ పాదయాత్ర పాయింట్ ను ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో అందివ్వడంలో న్యాయం చేకూర్చారు.

ప్లస్ పాయింట్స్ :

బలమైన కథ
కథానుసారం వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్స్
మమ్ముట్టి నటన
బ్యాక్గ్రౌండ్ స్కోర్
సినిమాకి తగ్గ నిడివి.

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ లో కొంచెం సాగదీత
ఇతర రాజకీయ పార్టీల సంబంధిత కొన్ని అనవసర సీన్లు
కమర్షియల్ ఎలిమెంట్స్

తీర్పు :

మొత్తానికి చూసుకున్నట్టయితే “యాత్ర” వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు మాత్రం ఒక పండుగ లాంటిదే అని చెప్పాలి.కథానుసారం సాగే ఎమోషనల్ సీన్లు,రాజశేఖర్ రెడ్డి 2004 లో చేసిన పాదయాత్రలో తనకి రైతులకు మధ్య వచ్చే భావోద్వేగపూరిత సన్నివేశాలు వైఎస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా మెప్పిస్తాయి.కాకపోతే కొంతమంది సినీ అభిమానులు ఆశించే అంశాలు అయితే ఈ సినిమాలో ఉండవు వారికి అయితే ఈ సినిమా అంతగా ఎక్కకపోయినా వై ఎస్ అభిమానులకు మాత్రం అమితంగా నచ్చుతుంది.

Rating : 3.5/5

REVIEW OVERVIEW
Yatra Movie Review in Telugu