వైరల్ అవుతున్న’యాత్ర ‘సాంగ్ : వర్ధంతి సందర్భంగా వైఎస్సాఆర్ కు ఘనమైన నివాళి!

Sunday, September 2nd, 2018, 01:30:42 PM IST

2004లో కాంగ్రెస్ విజయంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దివంగత మహానేత వైఎస్సార్, ఆ తరువాత 2009లో ఎంతో రసవత్తరంగా సాగిన ఎన్నికల్లో మరొకసారి కాంగ్రెస్ విజయంతో ఏపీకి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. అయితే రచ్చబండ కార్యక్రమంకోసం హెలికాఫ్టర్ లో బయల్దేరిన వైఎస్సార్ గారు, అనుకోకుండా జరిగిన ప్రమాదంలో రాష్ట్ర ప్రజలను విడిచి అనంతలోకాలకు వెళ్లిపోయారు. కాగా ఆ మహా నేత మరణించి నేటికి 9ఏళ్ళు. ఆ మహానేత 9వవర్ధంతిని పురస్కరించుకుని అయన బయోపిక్ గా రూపొందుతున్న యాత్ర చిత్రంలోని, అప్పట్లో జరిగిన వైఎస్సార్ పాదయాత్రకు సంబంధించి ఒక పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ చిత్రంలో మలయాళ నటుడు మమ్ముట్టి ఆ మహానేత పాత్ర పోషిస్తుండడగా, ఆనందోబ్రహ్మ చిత్రాన్ని తీసిన మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ‘నీ కన్నుల్లో కొలిమై రగిలే..కలేదో నిజమై తెలవారెనే.. వెతికే వెలుగే రానీ, ఈనాటి సుప్రభాత గీతమే..నీకిదే అన్నది స్వాగతం’ అనే పల్లవితో సాగే ఈ పాట, నాటి వైఎస్సాఆర్ పాదయాత్రను కళ్ళకు కట్టినట్లు చూపించింది. యాత్ర సందర్భంగా అయన వెంట వేలాదిగా ప్రజలు తరలివెళ్లి ఆ మహా నేతకు నీరాజనాలు పట్టిన అప్పటిరోజులను వైఎస్సార్ అభిమానులు ఈ పాటతో మరొక్కమారు నెమరువేసుకుంటున్నారు. కాగా నేడు విడుదలయిన ఈ పాట సొషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారింది…..

  •  
  •  
  •  
  •  

Comments