సంచ‌ల‌నం సృష్టిస్తున్న టైమ్స్‌నౌ క‌థ‌నం!

Thursday, March 14th, 2019, 09:28:03 AM IST

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా కొద్దీ ఏపీలో చిత్ర విచిత్ర సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అధికార తేదేపా నుంచి వైసీపీకి..వైసీపీ నుంచి టీడీపీకి నేత‌లు క‌ప్ప‌ల్లా దూకేస్తున్నారు. ఇదిలా వుంటే గ‌త కొంత కాలంగా బీజేపీ, వైసీపీ ఇద్ద‌రూ తోడుదొంగ‌లే అంటూ వాదిస్తూ వ‌స్తున్న టీడీపీకి బ‌లాన్ని చేకూరుస్తూ టైమ్స్ నౌ ప్ర‌సారం చేసిన‌ క‌థ‌నం ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. టౌమ్స్ నౌ జ‌రిపిన స్టింగ్ ఆప‌రేష‌న్‌లో జ‌గ‌న్‌, మోదీ మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పందం జ‌రిగింద‌నే సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి రావ‌డం కల‌క‌లం రేపుతోంది.

స్వ‌యంగా వైసీపీకి చెందిన ఓ యువ నేత టౌమ్స్ నౌ జ‌రిపిన ర‌హ‌స్య ఆప‌రేష‌న్‌లో సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన ఓ వీడియో ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. బీజేపీతో వైసీపీ ర‌హ‌స్య ఒప్పందం కుదుర్చుకుంద‌ని, ఈ ఐదేళ్ల‌లో జ‌గ‌న్ చాలా మారిపోయార‌ని, అత‌ను మార‌డానికి ప్ర‌ధాన కార‌ణం విజ‌య‌సాయిరెడ్డి అని స‌ద‌రు వ్య‌క్తి వెల్ల‌డించారు. జ‌గ‌న్ వ‌న్స్ అధికారం చేప‌డితే చంద్ర‌బాబు నాయుడు ఏమౌతారో, ఎక్క‌డుంటారో చెప్ప‌డం క‌ష్ట‌మ‌ని, జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే చంద్ర‌బాబు అండ్ కో జైలు ఊచ‌లు లెక్క‌బెట్ట‌డం గ్యారంటీ అని వైసీపీ నేత టౌమ్స్ నౌ జ‌రిపిన స్టింగ్ ఆప‌రేష‌న్‌లో వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది