ఏపీ బ్లాస్టింగ్ న్యూస్.. జ‌గ‌న్-ప‌వ‌న్‌లు నిజంగానే క‌లువ‌నున్నారా.. టైమ్ కూడా ఫిక్స్ అయ్యిందా..?

Friday, October 19th, 2018, 11:55:11 AM IST

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, జ‌న‌సేన అధ్య‌క్ష‌డు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌కు సంబంధించిన ఒక వార్త రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అసలు మ్యాట‌ర్ ఏంటంటే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జ‌గ‌న్-ప‌వ‌న్‌లు చేతులు క‌లిపేస్తార‌నే టాక్ రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది. అయితే వీరిద్ద‌రి క‌ల‌యిక సాధ్య‌మేనా అంటే.. అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌క‌లు. తెలంగాణ‌లో ఈ ఏడాది జ‌రుగ‌నున్న సార్వ‌త్రికి ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం.. జ‌గ‌న్- ప‌వ‌న్‌లు పొత్తు లేదా ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న‌తో క‌లిసే అవ‌కాశం ఉంద‌ని రాజకీయ నిపుణులు తేల్చేస్తున్నారు.

దీంతో ఈ వార్త వైసీపీ, జ‌న‌సేన శ్రేణుల‌కు ఆనందాన్ని ఇస్తుంటే.. అధికార టీడీపీ శ్రేణుల‌ను మాత్రం క‌ల‌వ‌ర పెడుతోంది. తెలంగాణ‌లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా.. టీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా మ‌హాకూటామి(కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్) ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో అక్క‌డ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత వ‌చ్చే ఓట్ల శాతాన్ని బట్టి.. ఏపీలో ఉన్న వైసీపీ కూడా త‌న ఈక్వేష‌న్ల‌ను మార్చుకోవ‌డం ఖాయ‌మ‌ని.. ఈ నేప‌ధ్యంలో వైసీపీ-జ‌న‌సేన పార్టీలు ఎలాగైనా అదికార పార్టీని ఓడించ‌డానికి చేతులు క‌లిపే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఈ నేప‌ధ్యంలో అధికారం టీడీపీ ఎలాంటి ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments