సంతలో పశువుల్లాగా నేతలను కొనేస్తున్నారు.. వైసిపినేత

Tuesday, October 17th, 2017, 03:50:12 AM IST

మారోసారి ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో ఫిరాయంపుల పర్వం మొదలైందనే కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే జగన్ పార్టీని బలోపేతం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంత కష్టపడినా గత ఎలక్షన్స్ లో మాత్రం ఏ విధమైన లాభాన్ని పొందడం లేదు. పైగా పార్టీ లీడర్ల మధ్యలో విభేదాలు రావడం జగన్ ని కాస్త ఇబ్బందుల్లో పడేసినట్లు తెలుస్తోంది. అనుకున్నట్టుగానే కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుక నేడు టీడీపీలో చేరనున్నారు. ఆమె వెళ్లిపోవడంతో కర్నూలులో అసలు బలం వైసిపికి ఉంటుందా అనే కోణంలో అనుమానాలు మొదలయ్యాయి.

అయితే ఆమె వెళ్లడంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రాణం ఉన్నంత వరకు టిడిపిలోనే ఉంటానని రేణుక చెప్పారు. ఇప్పుడు ఆ మాటలు ఏమైపోయాయి అని ప్రశ్నించారు. అంతే కాకుండా టీడీపీలో ఫిరాయింపు దారులకు ఏ మాత్రం గౌరవం లేదని ఆయన కామెంట్ చేశారు. అదే విధంగా పార్టీ మారితే టిడిపిలో ఎలాంటి గౌరవం ఉండదని ఆ విషయాన్నీ రేణుక గ్రహించాలని తెలిపారు. ఇక అధికార పార్టీ అధ్యక్షులు సంతలో పశువులను కొన్నట్లు విపక్ష నేతలను కొనేస్తున్నారని బీవై రామయ్య ఆగ్రహించారు. ఇక త్వరలో జగన్ ప్రారంభించబోయే పాదయాత్రతో మళ్లీ తెలుగుదేశం పార్టీ నేతల్లో దడ మొదలవుతుందని వచ్చే ఎన్నికల్లో వైసిపి విజయం సాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments