భూమనలో మొదలైన టెన్షన్..అరెస్ట్ చేస్తారా..?

Tuesday, September 20th, 2016, 01:32:11 PM IST

Bhumana-Karunakar-Reddy
తుని ఘటనలో సిఐడి అధికారులు విచారణను వేగవంతం చేసారు.ఇప్పటికే రెండు సార్లు వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డిని విచారించిన సిఐడి అధికారులు మరో మారు నేడు విచారించనున్నారు.పదే పదే భూమానాను విచారించడంతో అతని ని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది. తుని విధ్వంసంలో కరుణాకర్ రెడ్డిని సిఐడి అధికారులు దోషిగా అనుమానిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కాగా విచారణకు హాజరయ్యోముందు కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనని అరెస్టు చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితమైన రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. తనని అరెస్టు చేస్తే ప్రత్యక్షంగా కాపు ఉద్యమం లోకి దిగుతానని హెచ్చరించారు.ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకు ఏదో ఒక నెపంతో వైసిపిని ఇరుకున పెట్టె ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబును ఆరోపించారు.తుని ఘటనతో తనకు ఎలాంటి సంభందం లేదని ఆయన అన్నారు.ముద్రగడ పోరాటానికి తమ నాయకుడు జగన్ నైతికంగా మద్దుతు తెలపడం జీర్ణించుకోలేకే వైసిపి పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.