పవన్ నాపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిందే..వైసీపీ నేత!

Tuesday, October 23rd, 2018, 03:28:35 PM IST

ఈ నెల 15 వ తారీఖున జనసేన పార్టీ అధ్యక్షుడు తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజి మీద భారీ కవాతు నిర్వహించిన సంగతి తెలిసినదే.అయితే ఆ రోజు కవాతు అనంతరం అక్కడ పెట్టినటువంటి భారీ బహిరంగ సభలో చంద్రబాబు మీద మరియు నారా లోకేష్ లతో పాటు వైసీపీ నేతల మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శించారు.అయితే ఇప్పుడు అక్కడ కాకినాడ కి చెందినటువంటి వైఎస్సార్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చంద్ర శేఖర రెడ్డి ఆ రోజు పవన్ తన మీద కావాలనే తప్పుడు ఆరోపణలు చేశారని,పవన్ ఇప్పుడు ఆ మాటలను వెనక్కి తీసుకొని తనకి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.

అయితే ఆ బహిరంగ సభలో పవన్ చంద్ర శేఖర రెడ్డి మీద అక్కడి బ్రాహ్మణులను బెదిరించి బలవంతంగా అక్కడి భూములు లాక్కొని అక్కడ షాపింగ్ కంప్లెక్సులు కట్టుకున్నానని పవన్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ స్థలాన్ని ఎలాంటి తప్పు చెయ్యకుండానే ఇంకా తాను ఎమ్మెల్యే కాకముందే కొనుక్కున్నానని పవన్ కి బహిరంగంగా ఒక లేఖ విడుదల చేశారు.పవన్ సరైన సమాచారం తెలుసుకోని మాట్లాడితే బాగుంటుందని నాపై చేసినటువంటి ఆరోపణలకు గాను పవన్ సమాధానం ఇవ్వాల్సిందే అని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments