జనసేన పార్టీని చంద్రబాబుకి ఎంతకి అమ్మేశారు..వైసీపీ నేత షాకింగ్ కామెంట్స్.!

Sunday, November 18th, 2018, 09:07:28 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రజా పోరాట యాత్రలో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీని మరియు చంద్రబాబు లోకేష్ లను మాత్రమే తీవ్ర స్థాయిలో విమర్శించేవారు.అయితే గత కొద్ది రోజులు నుంచి చూసుకుంటున్నట్టు అయితే ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మీద కూడా తీవ్ర స్థాయిలో విరుచుకు పడడం మొదలు పెట్టారు.దీనితో పవన్ చేసేటటువంటి వ్యాఖ్యలకు గాను వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో వారి యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడు తాజాగా వైసీపీ కి చెందిన నేత సుధాకర్ బాబు పవన్ జగన్ మీద చేస్తున్న విమర్శలకు గాను సమాధానం ఇచ్చారు.

పవన్ జగన్ మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తమని ఎంతగానో బాధ పెట్టాయని,పవన్ అసలు ఏం మాట్లాడుతాడో కూడా ఆయనకే తెలీదు అని ఎప్పుడు ఏ బట్టలు వేసుకుంటాడో,అసలు ఆయన జుట్టు ఎప్పుడు కత్తిరించుకుంటాడో ఆయనకే తెలీదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు అంతే కాకుండా పవన్ ఇప్పుడు కొత్తగా టీడీపీని విమర్శిస్తున్నారని,ముందు అంతా చంద్రబాబుకి మద్దతుగా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఎంత తీసుకున్నారు అని మండిపడ్డారు.అంతే కాకుండా 2014 లో పవన్ తన జనసేన పార్టీని చంద్రబాబుకి అమ్మేశాడని,పవన్ తన పార్టీని చంద్రబాబుకి ఇంతకీ అమ్మేశారు అని వివాదానికి దారి తీసే వ్యాఖ్యలు చేశారు.వందల రోజులు నుంచి చెమటలు కక్కుతూ జనం కోసం జగన్ పాదయాత్ర చేస్తుంటే మీరు జగన్ ని విమర్శిస్తారా అని పవన్ పై నిప్పులు చెరిగారు.