వీడియో : జగన్ నాట్లు వేయడం చూశారా?

Saturday, January 13th, 2018, 01:10:26 AM IST

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సంకల్ప యాత్రను రెస్ట్ తీసుకోకుండా కొనసాగిస్తున్నాడు. నెక్స్ట్ ఎలక్షన్ లో ఎలాగైనా గెలవాలని జగన్ విశ్వా ప్రయత్నాలు చేస్తున్నాడు. తన ప్రసంగాలతో జనాలను ఆకర్షిస్తూ ఎదురొచ్చిన ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ వెళుతున్నాడు. సాధారణ వ్యక్తిలా జనాలతో కలిసి పోతున్నాడు. అంతే కాకుండా అధికార పార్టీ చేసిన లోపాలను జనాలకు గుర్తు చేస్తూ.. నెక్స్ట్ ఎన్నికల్లో వైసిపి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాడు.

ఇక అసలు విషయానికి వస్తే జగన్ పాదయాత్రలో కొన్ని పనులు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. రైతులతో కలిసి కొన్ని పనులను చేస్తున్నాడు. శుక్రవారం చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని రామచంద్రపురం, క‌మ్మ‌ప‌ల్లె, తిమ్మరాజుపల్లి పాటు ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. అయితే క‌మ్మ‌ప‌ల్లె గ్రామ సమీపంలో ఓ రైతు పని చేస్తుండగా అక్కడికి వెళ్లిన జగన్ ట్రాక్టర్ తో నాట్లు వేశారు. జగన్ నాట్లు వేస్తున్నాడని చుట్టూ ప్రక్కల ప్రాంత వాసులు అక్కడికి చేరుకొని వారిని చూశారు. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments