అనంత‌పురం జిల్లాలో క‌ల‌క‌లం.. వైసీపీ నేత దారుణ హ‌త్య‌.. ప‌రిటాల ఫ్యామిలీ హ‌స్తం ఉందా..?

Wednesday, October 10th, 2018, 02:42:44 PM IST

అనంత‌పురం జిల్లాలో పాత క‌క్ష‌లు భ‌గ్గుమ‌న్నాయి. దీంతో వైసీపీ నేత‌ మాజీ స‌ర్పంచ్ కేశ‌వ‌రెడ్డి గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల చేతుల్లో హ‌త్య‌కు గుర‌య్యారు. అస‌లు వివ‌రాల్లోకి ఆత్మ‌కూరుకు చెందిన కేశ‌వ‌రెడ్డిని బుధ‌వారం కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రాళ్ళతో కొట్టి చంప‌డంతో అనంపురం జిల్లాలో క‌ల‌క‌లం రేపింది. కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్య ఉన్న పాత క‌క్ష‌ల కార‌ణంగానే ఈ హ‌త్య జ‌రిగి ఉండొచ్చ‌ని అక్క‌డి పోలీసులు అనుమానిస్తున్నారు.

పాత కక్షల కారణంగా.. ప‌క్కా పథకం ప‍్రకారమే కేశవరెడ్డి పై మూకుమ్ముడిగా దాడి చేశారని… అయితే దాడిలో తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డిని హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించగా.. ఆయ‌న‌ చికిత్స పొందుతూ మృతిచెందారని వైధ్యులు తెలిపారు.ఇక ఆత్మ‌కూరు మాజీ సర్పంచ్‌ అయిన కేశవరెడ్డికి.. ప‌రిటాల ఫ్యామిలీకి ఎప్ప‌టి నుండో విరోధం ఉంది.. దీంతో కేశ‌వ‌రెడ్డిని ప‌రిటాల కుటుంబ‌మే హ‌త్య చేయించిఉంటుంద‌ని కేశ‌వ‌రెడ్డి వ‌ర్గీయులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా హ‌త్య ఘ‌ట‌న‌లో మంత్రి సునీత సోద‌రుడి ప్ర‌మేయం ఉంద‌ని
కేశవరెడ్డి భార్య రాజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.