జగన్ కు షాక్.. ఆ మంత్రితో పాటు ఎమ్మెల్యేలు కూడా జంప్ ?

Monday, October 16th, 2017, 08:39:22 AM IST

ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చే ఎలక్షన్స్ లో ఎలాంటి మార్పులు చోటి చేసుకుంటాయనేది ఎవరు ఉహించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం టీడీపీ బలంగానే ఉన్నా వైసిపి కూడా ఈ సారి ఎలాగైనా గెలవాలని తన బలాన్ని పెంచుంకోవాలని చూస్తోంది. గడిచిన ఎన్నికలలో టీడీపీదే అగ్రస్థానం అయినా వైసిపి ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే జగన్ నెక్స్ట్ ఎలక్షన్స్ కి తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. అంతే కాకుండా అయన పాదయాత్రతో తండ్రి లగే జనాలను ఆకర్షించాలని చూస్తున్నారు. అంతే కాకుండా ఇప్పుడున్న నాయకులు కూడా అధికార పక్షం వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కానీ జగన్మోహన్ రెడ్డి కి ఊహించని షాక్ తగిలిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీలో చాలా మంది నేతలు వలసలు వెళ్లిన సంగతి తెలిసిందే . అయితే ఇప్పుడు మరో నేత టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు వెళుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆమె ఎవరో కాదు కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుక. గత సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి కర్నూలు నుంచి ఆమె ఎంపీగా గెలిచారు. కానీ ఈ సారి జగన్, రేణుకను ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రతిపాదించారు. అయితే ఆమె అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆమె టీడీపీలోకి చేరితే ఆ పార్టీ నేతలు కర్నూలు ఎంపీ సీటును ఆఫర్ చేస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఆమె టీడీపీలోకి చేరితే వైసిపికి గట్టి దెబ్బ పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే కాకుండా మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీలోకి వెళుతున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా వరకు వైసిపి ఎమ్మెల్యేలు నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచేది అనుమానమేనని టీడీపీలోకి వెళితే గెలవకపోయినా అధికార పార్టీలో ఉండవచ్చునని అటువైపు వెళుతున్నట్లు టాక్. మరి జగన్ ఈ పరిస్థితుల్లో ఏం చేస్తాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments