జగన్ పై దాడి కేసులో కేంద్రం జోక్యం పై అనుమానాలు…?

Tuesday, October 30th, 2018, 10:30:00 AM IST

ఆరు రోజుల క్రితం ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు పై దర్యాప్తు జరుగుతున్నా సంగతి తెలిసిందే, కాకపోతే ఈ దాడి వెనక పాత్రధారులు, సూత్రధారులు పేర్లు దర్యాప్తు లో బయట పడతాయా అన్నదే ప్రశ్నఅర్థకంగా మారింది. ఈ కేసు విషయం లో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్ ), రెండు రోజుల విచారణ ముగిసిన ఫలితం శూన్యం. కేసులో పురోగతి కనిపించటం లేదు.

ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థల జోక్యం కొరతూ వైసీపీ నేతలు ఇప్పటికే ఢిల్లీ బాట పట్టారు, హోమ్ మంత్రి రాజ్ నాథ్ ను కలిసి ఈ కేసులో లోతైన విచారణ పారదర్శకంగా జరగాలంటే కేంద్రం జోక్యం అవసరం అని పేర్కొన్నారు. ఈ కేసు విషయం లో కేంద్రం ఎంత చేయాలో అంతా చేస్తున్నాడని రాజ్ నాథ్ హామీ ఇచ్చినట్టు వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఈ కేసు విషయం లో కేంద్రం వైఖరి ఏంటన్నది తెలియరావడం లేదు, ఒకవేళ కేంద్రం రంగం లోకి దిగితే చంద్రబాబుతో డైరెక్ట్ ఫైట్ కి సిద్దపడ్డట్టే అని భావించాలి. ఒకవైపు సిట్ దర్యాప్తు జరుగుతున్నప్పటికీ, ఇది జగన్ తనపై తాను చేసుకున్న దాడిగా టీడీపీ నేతలు అభివర్ణించటం గమనార్హం. మరో వైపు దర్యాప్తు చుస్తే అంగుళం కూడా ముందుకు కదలకుండా ఎలాంటి పురోగతి లేకుండా సాగుతుంది, ఈ క్రమంలో టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఈ కేసు ప్రభావితం చేసే శక్తులు ఎక్కువగా ఉన్నట్టు కన్పిస్తుంది.

మొత్తానికి ఈ కేసు ను ఎటూ కాకుండా టీడీపీ తాము అనుకున్న రాజకీయ కోణంలోనే ముగింపు వచ్చేలా టీడీపీ ప్లాన్ ఉందేమో అని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిట్ పేరిట హడావుడి చేస్తున్న పోలీసులు కూడా నామమాత్రపు పాత్ర పోషించి చెతులు దులిపేసుకుంటారేమో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments