వైసీపీ నేతల సంచ‌ల‌న నిర్ణయం.. అక్క‌డే తేల్చుకోనున్నారా..?

Saturday, October 27th, 2018, 05:46:00 PM IST

ఏపీ ప్ర‌త్రిప‌క్ష అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై జ‌రిగిన దాడి పై ఏపీ స‌ర్కార్ కేసు విచార‌ణ‌ను సిట్‌కు అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే. అయితే జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న పై విచార‌ణం సక్రమంగా జరగడం లేదని భావిస్తున్న వైసీపీ నేతలు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ నేత‌లంతా ఆదివారం ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను, కేంద్ర హోంమంత్రి రాజ్ రాజ్‌నాథ్‌ సింగ్‌ను క‌లిసి విచార‌ణ జ‌రుగుతున్న తీరు పై ఫిర్యాదు చేసేందుకు నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది.

ఇక వైసీపీ నుండి దాదాపు 15 మంది ముఖ్య‌నేత‌లు ఢిల్లీకి వెళ్ళ‌నున్నార‌ని తెలుస్తోంది. త‌మ అధినేత జ‌గ‌న్ ఘ‌ట‌న పై ద‌ర్యాప్తుకోసం ఏర్పాటు చేసిన సిట్ పై త‌మ‌కు న‌మ్మ‌కం లేద‌ని.. ఏదైనా స్వ‌తంత్ర సంస్థ‌తో విచార‌ణ జ‌రిపించాల‌ని వైసీపీ నేత‌లు కోర‌నున్నార‌ని స‌మాచారం. ఇక జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిన త‌ర్వాత అధికార టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా, జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి పై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసిన టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్య‌క‌ర్త‌ల‌కు సంబంధించిన వ్యాఖ్య‌ల సీడీల‌ను కూడా వైసీపీ ఇవ్వ‌నున్న ఫిర్యాదులో జ‌త‌చేసి రాష్ట్ర‌ప‌తి రామ్‌న‌థ్ కోవింద్‌కు స‌మ‌ర్పించ‌నున్నార‌ని స‌మాచారం. మ‌రి వైసీపీ నేత‌లు ఫిర్యాదు చేసిన త‌ర్వాత రాష్ట్ర‌ప‌తి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.