ఏపీ సెన్షేష‌న్.. ఆప‌రేష‌న్ గ‌రుడ ఎఫెక్ట్.. హీరో శివాజీపై రాజద్రోహం కేసు..?

Wednesday, November 7th, 2018, 05:11:48 PM IST

ఆప‌రేష‌న్ గ‌రుడ దెబ్బ‌కి సినీ న‌టుడు శివాజీకి చుక్క‌లు క‌న‌ప‌డేలా ఉన్నాయి. తాజాగా శివాజీ పై రాజ‌ద్ర‌దోహం కేసు న‌మోదు చేయాలంటూ.. వైసీపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆప‌రేష‌న్ గ‌రుడ‌లో భాగంగా జ‌గ‌న్‌పై దాడి జ‌రుగుతుంద‌ని శివాజీకి తెలుసో విచారించాల‌ని వైసీపీ నేత‌లు కోరారు. జ‌గ‌న్‌కి వ‌స్తున్న ప్ర‌జాద‌ర‌ణ చూసి త‌ట్టుకోలేక‌.. టీడీపీనే కుట్ర పన్ని జగన్ పై దాడి చేయించిందని, అయితే ఆప‌రేష‌న్ గ‌రుడ అంటూ ఓ స‌రికొత్త క‌థ‌ని తెర‌పైకి తెచ్చి డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ శ్రేణ‌లు ఆరోపిస్తున్నారు.

ఇక‌ ఈ క్ర‌మంలో వైసీపీ లీగ‌ల్ సెల్ నాయ‌కులు.. గోవిందరాజులు, దాదాఖలందర్, ఈశ్వరప్ప తదితర నాయకులు తాజాగా అనంత‌పురం డీఎస్పీ వెంక‌ట్రావును క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత‌లు.. జ‌గ‌న్ పై హత్యాయత్నంలో భాగంగా జ‌రిగిన దాడి కేసులో శివాజీతోపాటు మరి కొందరు పెద్ద స్థాయి నాయకుల పాత్ర ఉందనే అనుమానం వ్యక్తంచేశారు. శివాజీపై రాజద్రోహం కేసు నమోదు చేయాలనీ, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ లీగల్ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. అయితే శివాజీ మాత్రం తాను చట్టపరమైన హక్కులు ఉపయోగించుకుని తనకు తెలిసిన వివరాలు వెల్లడించానని చెబుతున్నారు. మ‌రి ఈ వైసీపీ యాక్ష‌న్ పై శివాజీ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.