తన ప్రాణానికి ప్రమాదం ఉందంటున్న వైసీపీ ఎమ్మెల్యే..!

Thursday, October 11th, 2018, 03:50:01 AM IST

ఈ రోజు తెలంగాణలోని రేవంత్ రెడ్డి పైనే హత్యా యత్నాలు జరగబోతున్నాయని ఇంటలిజెన్స్ వారు తనకి నివేదిక ఇచ్చారని రేవంత్ రెడ్డి తనకి రక్షణ కల్పించాలి అంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నట్టుగా లేఖను సమర్పించినట్టుగా వచినటువంటి వార్త సంచలనంగా మారింది.ఇది తెలంగాణలో ఐతే ఇప్పుడు తాజగా ఆంధ్రప్రదేశ్ లో తన ప్రాణానికి ప్రమాదం ఉందంటూ,తనకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ ఫిర్యాదు చేశారు.

గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే తనకు ప్రాణహాని ఉందంటూ అక్కడి డీజీపీ ఠాకూర్ కు తన ఫిర్యాదును అందజేశారు.అంతకు మునుపే తనకి కొంతమంది మావోయిస్టుల నుంచి మరియు ఇసుక మాఫియా ముఠాల నుంచి బెదిరింపు కాల్స్ మరియు లేఖలు వచ్చాయని,పేర్కొన్నారు.ఈ విధంగా వస్తున్నటువంటి బెదిరింపులకు ఇదివరకే డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళాను కానీ అటు నుంచి సానుకూల స్పందన ఏమి రాలేదని దానికి తోడు తన భద్రతా సిబ్బందిని కూడా తొలగిస్తున్నారని రామకృష్ణ తెలిపారు.ఎవరో గుర్తు తెలీని వ్యక్తులు తనకి బెదిరింపు లేఖలు పంపుతున్నారని,దీనిపై డీజీపీ గారు కానీ చర్యలు తీసుకోనట్టయితే న్యాయస్థానం మెట్లెక్కుతానని తెలిపారు.