రోజా ఓటేసిన ప్రజలను గాలికొదిలేసి షూటింగులు చేసుకుంటున్నారు.!

Friday, October 12th, 2018, 05:53:57 PM IST

ప్రముఖ సీనియర్ నటి మరియు వైసీపీ పార్టీకి చెందినటువంటి నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా పై అక్కడి తెలుగుదేశం పార్టీ గాలి ముద్దు కృష్ణ తనయుడు గాలి భాను కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.గాలి ముద్దు కృష్ణ గారి మరణాంతరం అక్కడి తెలుగుదేశం పార్టీ నగర ఇంచార్జి గా గాలి భాను భాద్యతలను తీసుకున్నారు.ఆయన అక్కడి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా పై మాట్లాడుతూ,ప్రజలందరు తమకి ఎదో మంచి చేస్తారని చెప్పి ఓట్లేసి రోజా గారిని గెలిపిస్తే ఆవిడేమో వీళ్ళను అస్సలు పట్టించుకోవట్లేదని విమర్శించారు.

అంతే కాకుండా రోజా ఒక భాద్యత గల పదవిలో ఉండి,ఇక్కడి సమస్యలను గాలికొదిలేసి హైదరాబాద్ లోను చెన్నైలకు షూటింగులు అంటూ స్టూడియోలను పట్టుకొని తిరుగుతున్నారని విమర్శించారు.ఇక్కడ తమకి ఓట్లేసినటువంటి ప్రజలను వారి మానాన రోడ్డు మీద వదిలేసిందని ఆరోపించారు.ఎదో అప్పుడప్పుడు మొక్కుబడిగా వచ్చి ఎదో సంచలనం సృష్టించడానికి వచ్చి ఏవో బూతులు మాట్లాడేసి వెళ్లిపోవడం ఆవిడ వైఖిరి అయ్యిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.నాలుగున్నర సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా కనీసం రోజా గారికి ఏ రోడ్డు ఎక్కడ వేస్తారో కూడా తెలీదని విమర్శించారు.