హీరో శివాజీ జంప్ అయ్యాడు.. వైసీపీ ఎమ్మెల్యే రోజా సెన్షేష‌న్..!

Tuesday, October 30th, 2018, 12:30:43 PM IST


ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై హ‌త్యాయ‌త్నంలో జ‌రిగిన దాడి ఘ‌ట‌న పై.. ఎమ్మెల్యే రోజా తాజాగా చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న రోజా మాట్లాడుతూ.. జ‌గ‌న్ పై దాడి టీడీపీ కుట్రే అని తేల్చేశారు. ఆప‌రేష‌న్ గ‌రుడను ప్రెజెంట్ చేసిన శివాజీ అమెరికా పారిపోయాడ‌ని.. టీడీపీ నేత‌ల స‌హ‌కారంతోనే శివాజీ విదేశాల‌కు జంప్ అయ్యాడ‌ని రోజా ఆరోపించారు. చంద్ర‌బాబు అండ్ కో రాజ‌కీయాలు చూస్తుంటే కంప‌రం వేస్తోంద‌ని రోజా మండిప‌డ్డారు.

ఇక జ‌గ‌న్ పై దాడికి పాల్ప‌డిన వ్య‌క్తి వైసీపీ అభిమానిగా తేల్చ‌డానికి టీడీపీ నేత‌లు నానా ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. విశాఖ‌లో జగన్‌పై దాడి జరిగిన వెంట‌నే డీజీపీ మీడియా ముందుకు వ‌చ్చి.. అత‌ను జగన్‌ అభిమాని అని చెప్పడం, ఆ వెంట‌నే జ‌గ‌న్‌తో నిందితుడు శ్రీనివాస్ ఉన్న‌ ఫ్లెక్సీని, విడుదల చేయడం వెనుక ఎంత పెద్ద కుట్ర ఉందో, అంద‌రికీ అర్ధ‌మ‌వుతోంద‌ని రోజా ఫైర్ అయ్యారు. ఇక దాడికి పాల్ప‌డిన వ్య‌క్తి ఇటీవ‌ల కోటి రూపాయిల భూమి కొనుగోలు చేసేందుకు బేరసారాలు ఆడాడని.. అంత డ‌బ్బు ఎక్క‌డి నుండి వ‌చ్చిందో టీడీపీ వాళ్ళ‌కే తెలియాలని రోజా అన్నారు. మ‌రి రోజా వ్యాఖ్య‌ల‌కు టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments