చంద్రబాబు రావణాసురుడు అయితే పరిటాల సునీత సూర్ఫణఖ..!

Thursday, October 25th, 2018, 01:30:24 PM IST

ఎప్పుడు ఏదొక వివాదంతో నోరు పారేసుకుని నోటికి ఏదొస్తే అది మాట్లాడుతారని,వైసీపీ ఎమ్మెల్యే మరియు ప్రముఖ నటి రోజా మీద పలువురు రాజకీయ నాయకులు అంటుంటారు.అయితే ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే రోజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు అయన పార్టీకి చెందిన పరిటాల సునీత మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబుని అయితే ఏకంగా ఏకవచనంతోనే మాట్లాడారు.చంద్రబాబు అసలు మహిళల కోసం ఏం చేసాడని ఆయన తన పార్టీకి ఓటు వెయ్యమని అడుగుతున్నారని మండిపడ్డారు.ప్రభుత్వంలో దాదాపు 60 వేల కోట్ల రూపాయలతో మహిళలు అప్పుల్లో ఉన్నారని చెప్పారని,మరి ఇప్పుడు కొత్తగా ఈ లెక్కలేంటి అని మండిపడ్డారు.

ఇంత దారుణంగా మహిళలని మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడేమో మహిళల్ని తమకి ఓటెయ్యమని అడుగుతున్నాడని,వారి పార్టీ జెండా వారి ఇంటి మీద ఎగుర వెయ్యించాలని మహిళలని సిగ్గులేకుండా అడుగుతున్నాడని మండిపడ్డారు.మరి ఈ చంద్రబాబే గతంలో నంద్యాలలో జరిగినటువంటి ఎలెక్షన్లలో నాకు ఓటెయ్యకపోతే నేను వేయించిన రోడ్డు మీద నడవొద్దు,నేనిచ్చే రేషన్ బియ్యం తినొద్దు అని అప్పుడు ఎలా బెదిరించాడో ఇప్పుడు కూడా అలాగే బెదిరిస్తున్నాడని మండిపడ్డారు.

అదే సమయంలో పరిటాల సునీత మీద మాట్లాడుతూ ఒక మహిళా నాయకురాలు అయ్యుండి నిస్సిగ్గుగా డ్వాక్రా రుణాలు మాఫి చెయ్యలేదని అసెంబ్లీ లో చెప్పుకున్నారని, ఆడవారి జీవితంతో ఆడుకుంటున్నటువంటి చంద్రబాబు ని మహిషాసురుడు, రావణాసురుడు అని అనకా దేవుడు అని అంటారా.. అని ప్రశ్నించారు.ఆయనకేమో వత్తాసుగా పరిటాల సునీత సూర్ఫణఖ లా ఉన్నారని వీరిరువురిపై రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments