జగన్ కి ఏమైనా అయితే ఊర్కునేది లేదు బాబుకి రోజా సీరియస్ వార్నింగ్..!

Thursday, October 25th, 2018, 04:34:44 PM IST

ఈ రోజు విశాఖ ఎయిర్ పోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత మీద జరిగిన దాడి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.మరీ ముఖ్యంగా వైసీపీ కి చెందిన నేతలు ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నారు.అయితే జగన్ పై ఈ రోజు జరిగిన దాడికి గాను ఆయన పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రముఖ నటి రోజా తీవ్ర స్థాయిలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఇదంతా చంద్రబాబు యొక్క కుట్ర లోని భాగమే అని రోజా మండిపడ్డారు.అసలు కనీసం ఐడి కార్డు కూడా తీసుకెళ్లనివ్వని ప్రాంతానికి ఒక వ్యక్తి కత్తితో ఎలా వెళ్లగలిగాడని ప్రశ్నించారు.

జగన్ పై దాడి జరిగితే చంద్రబాబుకి వత్తాసు పలికేటటువంటి చాన్నాళ్లు కనీసం ప్రచారం చెయ్యట్లేదు అని మండిపడ్డారు.అసలు జగన్ పై దాడికి పాల్పడిన వ్యక్తి ఆ కత్తికి ఏం పూసాడో, జగన్ కి మాత్రం జరగకూడనిది ఏమైనా జరిగితే మాత్రం వారి పార్టీ శ్రేణులు ఊరుకోమని బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నానని తెలిపారు.జగన్ మీద దాడికి పాల్పడిన వారు ఆ దాడికి వెనకుండి కారణమైన వాళ్ళు అందరు బయటకి రావాలని డిమాండ్ చేశారు.