జగన్ కన్నా ముందే పాదయాత్ర మొదలుపెట్టేశాడే..!

Sunday, October 22nd, 2017, 03:29:34 PM IST

వైసిపిలో జగన్ పాదయాత్ర ఫీవర్ స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలో వైసిపి అధినేత పాదయాత్ర చేయనుండడంతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఊగిపోతున్నాయి. అధినేత పాదయాత్రతో పార్టీ రూపురేఖలు మారిపోవడం ఖాయం అని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. కాగా జగన్ కన్నా ముందే వైసిపి ఎమ్మెల్యే గోపి రెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాదయాత్ర ప్రారంభించేశారు. కానీ ఆయన చేపట్టింది ప్రజా పాదయాత్ర కాదు. జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ శనివారం శ్రీనివాసులు రెడ్డి తిరుమలకు కాలినడకన బయలుదేరారు.

జగన్ ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందుతాయని అయన అన్నారు. చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఎమ్మెల్యే విమర్శించారు. సత్తెన పల్లిలో వినాయక పూజ నిర్వహించిన అనంతరం శ్రీనివాసులు రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ఎమ్మెల్యే అనుచరులు పార్టీ నాయకులు 150 మంది శ్రీనివాసులు రెడ్డి తో పాదయాత్రకు బయలుదేరారు. వచ్చే నెల 3 న ఆయన తిరుమలకు చేరుకోనున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments