జనసేన – జేఎఫ్సి ఒక నాటకం..తెర వెనుక ఉన్నది వారే: వైసిపి నేత

Monday, March 5th, 2018, 01:19:43 PM IST

ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అలాగే జయప్రకాశ్ నారాయణ – ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జాయింట్ ఫ్యాక్ట్ కమిటీ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా విషయంలో ఎంతవరకు రాష్ట్రానికి నిధులు అందించారు అనే విషయంపై ఈ కమిటీ సెర్చ్ చేసింది. రీసెంట్ గా కొన్ని లెక్కలను కూడా తేల్చారు. అయితే ఈ విషయంపై వైఎస్సార్ సిపి ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కమిటీ మొత్తం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కనుసైగలతో నడుస్తోందనీ మండిపడ్డారు.

ప్రజలను మభ్య పెట్టేందుకే జనసేన పార్టీ జేఎఫ్సి పేరుతో నాటకం ఆడుతున్నారని తెరవెనుక ఈ తతంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నడిపిస్తున్నారని తెలిపారు. దానికి అసలు నిర్మాత చంద్రబాబు. ఉండవల్లి – పవన్ కళ్యాణ్ – జేపీ వంటి వారికి కేవలం పేయిడ్ ఆర్టిస్టులు. నివేదికల వలన ప్రజలకు ఏ మాత్రం లాభం కలుగదు. జేఎఫ్సి వల్ల ఏమి జరగదు. వైఎస్సార్ పార్టీ వల్లే ప్రత్యేక సాధ్యం అవుతుందని టీడీపీ నేతలు మంత్రి వర్గం నుంచి బయటకి వచ్చి అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకాలని విజయసాయి తెలియజేశారు.