చంద్రబాబు ఒక మానసిక రోగి..విజయసాయి రెడ్డి సంచలనం.!

Thursday, November 8th, 2018, 05:03:41 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కిందటి నెలలో జరిగినటువంటి హత్యా ప్రయత్నం ఎంతటి సంచలనానికి దారి తీసిందో అందరికి తెలుసు,ఈ ఘటన పట్ల తెలుగుదేశం నేతలు ప్రవర్తించిన తీరు మీద వైసీపీ క్యాడర్ ఇంకా నిప్పులు చెరుగుతూనే ఉంది.అయితే తాజాగా వైసీపీ ప్రముఖ నేత విజయసాయి రెడ్డి ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్న తీరు మీద కొన్ని ఆసక్తికరమైన మరియు సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు నాయుడు ఒక మానసిక రోగి అని అతను ఎందుకు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తున్నాడో ఈ రోజు సైకాలజిస్టులు నిర్ధారణ చేశారని,చంద్రబాబు “పేథాలాజికాల్ లైయింగ్” అనే వ్యాధితో బాధపడుతున్నారని,ఈ వ్యాధి లక్ష మందిలో ఒకడికి జన్యు లోపం వలన వస్తుంది అని, అలాంటి వారు నిరంతరం కట్టుకథలు అల్లుతూ అబద్ధాలని నిజాలుగా చెప్తూ ప్రజలని మభ్యపెడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.అబద్ధాలకు రంగులద్ది సులువుని నేరుచుకున్న చంద్రబాబు తన జీవితంలో కూడా అదే తరహాని కొనసాగిస్తున్నాడని వ్యాఖ్యానించారు.ఇప్పుడు చంద్రబాబు కూడా అదే మానసిక రోగంతో బాధపడుతున్నారని వైద్యులు నిర్ధారించారని విజయసాయి రెడ్డి సంచలనం సృష్టించారు.