ఎన్టీఆర్ నే లేపేసిన వ్యక్తి చంద్రబాబు..విజయ సాయి రెడ్డి మాటల ధుమారం.!

Tuesday, October 30th, 2018, 02:35:26 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై జరిగినటువంటి హత్యా ప్రయత్నం తాలూకా మిస్టరీ ఇంకా వీడలేదు.దాడికి పాల్పడిన శ్రీనివాసరావు పై ఒక పక్క విచారణ కొనసాగుతుంటే మరో తెలుగుదేశం మరియు వై ఎస్ ఆర్ పార్టీల వారు ఒకరిని మించిన స్థాయిలో ఒకరు సంచలన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు.జగన్ పై హత్యా యత్నం జరగగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు కనీసం జగన్ కు తన పరామర్శ తెలపకపోవడమే కాకుండా జగన్ కు ఎందుకు ఇతరులు పరామరిస్తున్నారని అన్న మాటలు వైసీపీ శ్రేణుల్లో మరింత ఆగ్రహానికి దారి తీశాయి.చంద్రబాబు యొక్క ఈ చర్యలకు గాను ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.దానికి తోడు నిన్న టీడీపీ నేత అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ జగన్ మీద ఆయన కుటుంబ సభ్యులే దాడి చెయ్యించారన్న వ్యాఖ్యలు కూడా సంచలనం గా మారాయి.

ఇప్పుడు బాబు పై వైసీపీ లో అత్యంత కీలకమైన నేత విజయసాయి రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యక్తి ఇప్పుడు నేను చెప్తానని,ఒకవేళ చంద్రబాబు నాయుడుకే గాని లోకేష్ వల్ల తన ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు వస్తుందని తెలిస్తే అదే కోడి కత్తితో లోకేష్ నే చంద్రబాబు వేరే విధంగా లేపేసేవాడని,ఇదేమి అతిశెయోక్తి కాదు అతని మనస్తత్వమే అలాంటిదని మండిపడ్డారు. అంతే కాకుండా తాను ముఖ్యమంత్రి పీఠం మీద కన్నేసి ఎన్టీఆర్ నే లేపేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఎన్టీఆర్ గారిది సహజ మరణమా లేక చంపేసారా అని ఇరు పార్టీలలో దుమారం చెలరేగే మాటలు మాట్లాడారు.

  •  
  •  
  •  
  •  

Comments