జనసేన లోకి వైసిపి సీనియర్ నేత!

Wednesday, July 11th, 2018, 02:05:56 AM IST


ఇప్పటికే తన ప్రజాపోరాట యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, ఆయన యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం ఆయన విశాఖ జిల్లాలో తన యాత్ర కొనసాగిస్తున్నారు. కాగా కొన్నాళ్ల నుండి జనసేనలోకి చేరికలు బాగా పెరిగాయని చెప్పాలి. ఇప్పటికే భారీ ఎత్తున యువత, కొందరు సీనియర్లు కూడా పార్టీ తీర్ధం పుచ్చుకుంటుంటే, మరి కొంతమంది సిద్ధంగా వున్నారు. కాగా నేడు తణుకు జిల్లాలో గత ఎన్నికల్లో వైసిపి తరపున విస్తృత ప్రచారం నిర్వహించి, టికెట్ ఆశించిన నేత విడివాడ రామచంద్రరావు, ఇదివరకు వైసీపీలో టికెట్ దక్కకపోవడంతో, జనసేన నుండి ఆయనకు టికెట్ ఇస్తానని పవన్ మాటిసినట్లు తెలుస్తోంది. మండపాక నుండి తన అనుచరులతో స్వగృహం నుండి భారీగా ర్యాలీ గా వచ్చిన విడివాడ పవన్ సమక్షంలో చేరారు. కాగా ఆయన్ను పవన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రామచంద్ర రావు మాట్లాడుతూ, జనం కోసమే పుట్టిన జనసేనను అధికారం లోకి తీసుకురావడమే తన ముందున్న ప్రస్తుత సవాలని, ఖచ్చితంగా పార్టీ తరపున విరివిగా ప్రచారం నిర్వహించి ఎలాగైనా అధికారం లోకి తీసుకువస్తామని అన్నారు. పవన్ మాట్లాడుతూ, ఇంత భారీ ఎత్తున జనసేనలో చేరికలు ఉండడంతో తనకు చాలా ఆనందంగా ఉందని, ఈ మద్దతుతో తాను ప్రజా క్షేత్రంలో విజయం సాధిస్తాను అన్న నమ్మకం తప్పక కలుగుతోందని ఆయన అన్నారు. తమపార్టీ లోకి వచ్చేవారందరూ కూడా పదవుల కోసం కాకుండా తన పై అభిమానంతో, ప్రజా సేవ చేయడానికి చేరుతున్నందుకు మరింత ఆనందంగా ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తప్పకుండ తమ పార్టీకి పట్టకం కధాతారనే నమ్మకం తనకి ఉందని అన్నారు……

  •  
  •  
  •  
  •  

Comments