తూ.గో.జీలో జ‌గ‌న్‌కు భారీ షాక్… జ‌న‌సేన‌లో చేరిన వైసీపీ సీనియ‌ర్ నేత‌ (మాజీ ఎమ్మెల్యే)..!

Tuesday, October 9th, 2018, 11:45:15 AM IST

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. తెలంగాణ‌లో అయితే ఇప్ప‌టికే ఎన్నిక‌ల న‌గార మోగ‌గా.. ఏపీలో కూడా కొద్ది నెల‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌డంతో అక్క‌రి రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌ర స్థాయికి చేరుకున్నాయి. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారం లోకి రావాల‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ భావిస్తుండ‌గా.. అదికారం టీడీపీ మ‌రోసారి త‌న అధికారాన్ని నిలుపు కోవాల‌ని త‌నదైన ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నారు. ఇక మ‌ధ్య‌లో రేసులో తామున్నామంటూ జ‌న‌సేన కూడా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దోంతో ఏపీలో ఈసారి ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. శ్రీకాకుళంలో పాద‌యాత్ర చేస్తున్న వైసీపీ నేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి తాజాగా పెద్ద షాక్ త‌గిలింద‌ని స‌మాచారం. గ‌త ఏడాది నుండి ప్రజాసంక‌ల్ప యాత్ర‌లో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు త‌న న‌డ‌క‌తో చుట్టి వ‌స్తున్న జ‌గ‌న్‌.. ఇటీవ‌ల త‌న పాద‌యాత్ర గోదావ‌రి జిల్లాలో ముగించుకొని శ్రీకాకుళంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే తూర్పు గోదావరి జిల్లాలో జ‌గ‌న్‌కు మైండ్‌బ్లోయింగ్ షాక్ త‌గిలింది. అస‌లు విష‌యం ఏంటంటే.. వైసీపీ సీనియ‌ర్ నేత – పి. గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే పాల‌మూరు రాజేశ్వ‌రి వైసీపీకి గుడ్ బై చెప్పి.. జ‌న‌సేన పార్టీలో చేరారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మ‌క్షంలోనే ఆమె జ‌న‌సేన తీర్ధం పుచ్చుకున్నారు. ఇక రాజేశ్వ‌రి గురించి చెప్పాలంటే గతంలో కాంగ్రెస్ త‌రుపున పి.గ‌న్న‌వ‌రం నుండి రెండుసార్లు ఎన్నికైంది. అయితే ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా క‌నుమ‌రుగు అయిపోవ‌డంతో ఆమె వైసీపీలో చేరారు. అయితే ఏపీలో రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున‌ ఆమె టికెట్ ఆశించ‌గా ఆమెకు ల‌భించ‌లేదు. దీంతో వైసీపీలో ఉంటే లాభం లేద‌నుకున్న రాజేశ్వ‌రి.. జ‌న‌సేన‌లో చేరి వైసీపీకి పెద్ద షాకే షాక్ ఇచ్చారు. దీంతో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మయాన తూర్పుగోదావ‌రి జిల్లాలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు పెద్ద దెబ్బే త‌గిలింద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.