వైసీపీ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి పోటీ అక్క‌డి నుండే..?

Monday, November 12th, 2018, 09:20:02 AM IST

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నికలు త‌క్కువ స‌మ‌యం ఉన్నందున అధికార, ప్ర‌తిపక్షాలు త‌మ త‌మ ప్ర‌ణాళిక‌ల్లో వేగం పెంచాయి. ప్ర‌స్తుతం అధికార టీడీపీ తెలంగాణ‌లో జ‌రుగ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల పై దృష్టి కేంద్రీక‌రించింది. ఈ క్ర‌మంలో మ‌హాకూట‌మిలో భాగంగా టీడీపీ 14 స్థానాల్లో పోటీ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీడీపీ, ఏపీలో కూడా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం. ఇక మ‌రోవైపు వైసీపీ మాత్రం ఏపీలో ఒంట‌రిగానే బ‌రిలోకి దిగ‌నుంది.

ఇక అసలు మ్యాట‌ర్ ఏంటంటే.. వైసీపీ కంచుకోట‌గా ఉన్న నెల్లూరు జిల్లాలో మ‌రింత బ‌లోపేతం చేసుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది వైసీపీ ఈ క్ర‌మంలో వెంక‌ట‌గిరి అసెంబ్లీ నియ‌జ‌కవ‌ర్గ కోఆర్డినేట‌ర్‌గా మాజీ మంత్రి ఆనం రామనారాయ‌ణ‌రెడ్డిని నియ‌మిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది వైసీపీ. దీంతో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వెంక‌ట‌గిరి అసెంబ్లీ స్థానం నుండి రామ‌నాయ‌ణ‌రెడ్డి పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అబిప్రాయ ప‌డుతున్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో మ‌రోసారి త‌మ‌కు తిరుగుండ‌ద‌ని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు.