జ‌గ‌న్ షాక్ అయ్యేంత సీన్ లేద‌ని.. వైసీపీకి వ‌చ్చే న‌ష్టం లేద‌ని.. అంతే నంటారా..!

Saturday, October 13th, 2018, 02:00:34 AM IST

ఏపీలో ఎన్నిక‌ల హ‌డావుడి ఊపందుకుంది. సార్వత్రిక ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ఏపీ రాజ‌కీయాలు రోజురోజుకీ కొత్త మ‌లుపులు తిరుగుతున్నాయి.ఇక అధికార ప్ర‌తిప‌క్షాలు ఎన్నికలు స‌మీపిస్తుండడంతో త‌మ‌దైన ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటూ వ్యూహాలు రంచించుకుంటున్నారు. ఈ నేప‌ధ్‌యంలో ఏపీలోకి అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో అధికార, ప్ర‌తిప‌క్షాలు స‌ర్వేలు చేయించుకుంటూ, వాటి అనుగుణంగా త‌మ త‌మ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. పార్టీలన్నీ గెలుపే ల‌క్ష్యంగా ప్ర‌చారంలో మునిగి తేలుతున్నారు.

అయితే ఇక్క‌డ అస‌లు మ్య‌ట‌ర్ ఏంటంటే వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర చేస్తూ రాష్ట్ర‌మంత‌టా చుట్టి వస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఏపీలో పాజిటీవ్ బ‌జ్ తెచ్చుకున్న జ‌గ‌న్ పార్టీలోకి చాలామంది నేత‌లు క్యూలు క‌డుతున్నారు. అయితే ఈ నేపధ్యంలో ఉమ్మ‌డి ఏపీ మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ వైసీపీలో చేర‌నున్నార‌ని.. ర‌జ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రిగాయి. మ‌రోవైపు వైసీపీ ముఖ్య‌నేత‌లు కూడా నాదెండ్ల‌ను వైసీపీలో చేరాల‌ని ఆహ్వానించారు కూడా. దీంతో నాదెండ్ల వైసీపీలోకి చేరేందుకు సిద్ధం కూడా అయ్యార‌ని స‌మాచారం.

అయితే ఏంజ‌రిగిందో ఏమో గానీ ఆయ‌న జ‌గ‌న్‌కు పెద్ద షాక్ ఇస్తూ జ‌న‌సేనలో చేర‌నున్నార‌ని గురువారం మీడియా ముందు ప్ర‌క‌టించేశారు. ఇక ఈ శుక్ర‌వారమే మీడియా ముందు సమావేశం ఏర్పాటుచేసి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మ‌క్షంలో జనసేనలో చేరతున్నట్లు ప్రకటించనున్నారు. అంతే కాకుండా ఏపీలో రానున్న సార్వ‌త్రిక‌ఎన్నికల్లో జ‌న‌సేన త‌రుపున గుంటూరు జిల్లాలోని తెనాలి నియోజ‌క వ‌ర్గం నుండి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌నున్నార‌ని తెలుస్తోంది. ఏది ఏమైనా త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు పై ఊరిస్తూ వ‌చ్చిన నాదెండ్ల‌, ఒక‌వైపు కాంగ్రెస్‌కి మ‌రోవైపు జ‌గ‌న్‌కు ఒకేసారి పెద్ద షాక్ ఇచ్చార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. ఇక మ‌రోవైపు వైసీపీ శ్రేణులు కూడా నాడెండ్ల‌ను లైట్ తీసుకున్నారు. అత‌ను చేర‌నంత మాత్రాన.. జ‌గ‌న్ షాక్ అయ్యేంత సీన్ లేద‌ని.. వైసీపీకి వ‌చ్చే న‌ష్టం లేద‌ని.. 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌దేన‌ని ధీమా వ్య‌క్తం చేశారు.