చంద్రబాబు యువనేస్తం పథకంపై వెల్లువెత్తుతున్న విమర్శలు..!

Tuesday, October 2nd, 2018, 05:54:19 PM IST

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఆయన కుమారుడు నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకొని వారికి నెల నెల 1000 రూపాయలు నేరుగా వారి బ్యాంకు అకౌంటుకే జమ చేస్తామని “యువనేస్తం” అనే పేరిట ఈ రోజు ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది.ఏ ముహూర్తాన మొదలు పెట్టారో ఈ పథకానికి అసలు కలిసి రావటలేదు.ఇప్పటికే ఈ పథకం కేవలం చివరిలో చంద్రబాబు ఆడుతున్న డ్రామా అని కొందరు విమర్శలూ,ఈ రోజు నెల్లూరు లోని ఈ సభ వద్ద వైసీపీ మరియు టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదాలు తో ముగిసింది.

మళ్ళీ అంతలోనే ఈ రోజు విశాఖపట్నం జిల్లాలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ పార్టీ విద్యార్థి సంఘాలు చంద్రబాబుకి వ్యతిరేకంగా రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు.వారు ఈ దీక్షలో భాగంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెండు లక్షల పై చిలుకు ఉద్యోగాలను ఎందుకు భర్తీ చెయ్యలేదని,అవి ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. అంతే కాకుండా బాబు వస్తే జాబు వస్తుందన్నారు,ఆయన వచ్చాక ఆయన కొడుకు లోకేష్ కు తప్ప ఇంకెవ్వరికి ఉద్యోగం రాలేదని దుయ్యబట్టారు.ఈ రోజు యువ నేస్తం పేరిట అమలు చేస్తున్నది నిరుద్యోగ భృతి కాదని,అది కేవలం ఎన్నికల ముందు ఓటర్లను ఆకర్షితం చేసే “ఎన్నికల భృతి” మాత్రమే అని పేర్కొన్నారు.