టీడిపీ మీద ఎదురుదాడికి సిద్ధమైన వైసీపి..?

Friday, September 7th, 2018, 01:36:23 PM IST

ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలలో ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి “ప్రజా సంకల్ప యాత్ర” పేరిట పాద యాత్ర చేస్తున్న సంగతి తెలిసినదే. ప్రస్తుతం విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు, అయితే అదే సమయంలో జగన్ తన పార్టీ కార్యకర్తలు అందరికి ఈ నెల 11 న కీలక నిర్ణయాలు పట్ల దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలియజేసారు.

ఈ నెల 11 న జరగబోయే మీటింగులో ప్రతి ఒక్క ఎమ్మెల్యే హాజరు కావాలని సూచించారు వారి ప్రధాన లక్ష్యం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ అని వారు ప్రజలకు ఈ విధమైన అన్యాయం చేశారో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అందుకు గాను ఒక 100 రోజుల ప్రణాళికా బద్ధంగా ప్రతి నియోజక వర్గ నాయకుడు ప్రతి గ్రామానికి ప్రతి వాడకి వెళ్లి వారి పార్టీ ప్రచారం, నవ రత్నాల్లోని అంశాలు తో పాటు తెలుగుదేశ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగట్టి ప్రతి ఒక్కరి లోకి బలంగా తీసుకెళ్లాలి అని సూచించినట్టు తెలుస్తున్నది.

  •  
  •  
  •  
  •  

Comments