వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణ చోట ఉత్కంఠ పరిస్థితి.

Tuesday, October 9th, 2018, 03:12:54 PM IST

ప్రస్తుతం ప్రకాశం జిల్లా యద్దనపూడి ప్రాంతంలో ఈ రోజు సాయంత్రం దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని 5 గంటల సమయంలో ఆవిష్కరించబోతున్నారు.ఐతే ఇప్పుడు ఆ ప్రదేశం పోలీసు అధికారుల గట్టి బందోబస్తుతో ఉంది.అయితే దీనికి సరైన కారణం ఏమిటన్నది తెలీడం లేదు.ప్రధానంగా అక్కడి ప్రాంతంలో టీడీపీ మరియు వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు చెలరేగొచ్చని,పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

ఈ రోజు యద్దనపూడి ప్రాంతంలో అక్కడికి వైసీపీ ముఖ్య నాయకుడు బాలినేని శ్రీవాసరావు రెడ్డి గారి చేతుల మీదగా రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణ జరగనుంది.ఐతే ఇదే సందర్భంలో 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినట్టు వంటి వైసీపీ కార్యకర్త గొట్టి పాటి భరత్ కు మాత్రం ఆహ్వానం రాలేదు దీనికి కారణం ఆ విగ్రహం చేయించిన రావి రామనాదం. ఈయన ప్రస్తుతం ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు.గత కొద్ది కాలంగా వీరి ఇద్దరికీ మధ్య విభేదాలు ఉన్నాయని అందుకనే గొట్టిపాటి భరత్ ను పిలవలేదని తెలుస్తుంది.ఇప్పుడు ఈ సమస్యే ప్రధాన కారణం అయ్యింది.

ఎందుకంటే నిన్న రాత్రి సమయంలో అక్కడి దగ్గర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఫ్లెక్సీలను ఎవరో గుర్తు తెలీని వ్యక్తులు తగులబెట్టారు.తమని ఆహ్వానించలేదని భరత్ వర్గీయులే ఇలా చేసి ఉంటారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు,అదే సందర్భంలో మా పార్టీకి సంబందించిన ఫ్లెక్సీని కాల్చింది ఎవరంటూ అక్కడి టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చెప్పారు.దీనితో ఒక్కసారిగా అక్కడి పరిస్థితులు అన్ని వేడెక్కాయి.దానితో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యి గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.