కర్ణాటక వార్ : రెండు రోజుల్లోనే సీఎం సీటుకి యడ్యూరప్ప రాజీనామా!

Saturday, May 19th, 2018, 10:26:34 PM IST

కర్ణాటక రాజకీయాల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. గవర్నర్ నిర్ణయంతో హ్యాపీగా సీఎం సీటు ఎక్కి కూర్చున్న యడ్యూరప్ప రెండు రోజులు కూడా గడవకముందే తన పదవికి రాజీనామా చేశాడు. అసెంబ్లీలో తన బలపరీక్ష కు మద్దతు దొరకదని ముందే బావించిన యడ్యూరప్ప ఊహించని నిర్ణయం తీసుకోవడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కర్ణాటక ఎన్నికల్లో అత్యధిక సీట్లు అందుకున్న బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను మాత్రం అందుకోలేకపోయింది.

కాంగ్రెస్ జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని అనుకున్నాయి. కాంగ్రెస్ మొత్తం జెడిఎస్ కి మద్దతుగా నిలిచేందుకు రెడీ అయ్యింది. యడ్యూరప్ప ఫోన్ కాల్ లీక్ అవ్వడం కూడా బీజేపీ రాజకీయాల్లో కుదుపు తెచ్చింది. ఇతర పార్టీ నేతలకు మంత్రి పదవులను ఇస్తున్నట్లు అఫర్ చేయడం పెద్దగా వర్కౌట్ కాకపోగా న్యూస్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇక తాను బాల పరీక్షలో నెగ్గను అని డిసైడ్ అయినా యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments