పవన్ తాంత్రిక పూజలు.. పచ్చ మీడియా ప్రచారం!

Tuesday, October 2nd, 2018, 08:47:38 AM IST

కొన్నాళ్ల క్రితం వరకు రాష్ట్రంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్యనే పోరు నడిచేది. చంద్రబాబు వర్గం జగన్ ను అవినీతిపరుడు అంటుంటే జగన్ వర్గం బాబును చేతకాని ప్రభుత్వం అంటూ దుమ్మెత్తిపోసుకున్నారు. కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ దూరి ఒక చెత్తో బాబును, ఇంకో
చేత్తో జగన్ ను ఆటాడేసుకుంటున్నారు. దీంతో టీడీపీ, వైసీపీలకు జనసేనాని ఉమ్మడి టార్గెట్ అయ్యారు. కానీ పవన్ ను ఏ విషయంలో విమర్శించాలో మాత్రం ఇప్పటికీ జగన్, బాబు వర్గాలకు క్లారిటీ రాలేదు.

మొన్నా మధ్య పవన్ మీపై చేస్తున్న విమర్శలకు మీ స్పందన ఏమిటని జగన్ ను మీడియా కదిలించగా ఏం మాట్లాడాలో పాలుపోని జగన్ ఆయన కార్లను మార్చినట్టు పెళ్ళాల్ని మారుస్తారు అంటూ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. చివరికి జగన్ వ్యాఖ్యలను ఆయన పార్టీ వాళ్ళే సమర్థించలేకపోయారు. ఇక టీడీపీ వర్గం ఎప్పుడైతే పవన్ ఎదురుతిరిగాడని అనుకున్నారో ఆనాటి నుండి ఈనాటి వరకు పవన్ మీద నేరుగా విమర్శలకు దిగలేకపోయారు.

ఆయన వేసే కౌంటర్ల నుండి తప్పించుకునే ప్రయత్నమే కానీ ఎదురుదాడి చేయలేకపోయారు. దీంతో దొడ్డి దారిని ఎంచుకున్న చంద్రబాబు అనుకూల మీడియా పవన్ తాంత్రిక పూజలు చేస్తున్నారంటూ లేకి ప్రచారాన్ని మొదలుపెట్టింది. నిన్న తెల్లవారుజామున పవన్ జంగారెడ్డిగూడెం మండలంలోని ఐఎస్ జగన్నాధపురం గ్రామంలోని ప్రఖ్యాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజలు చేయగా అవి తాంత్రిక పూజలనే ప్రచారాన్ని మొదలుపెట్టారు. దీనికి సమాధానంగా జనసేన శ్రేణులు జంగారెడ్డిగూడెం మండలంలోని I.S జగన్నాధపురం గ్రామంలోని ప్రఖ్యాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటూ సమధానం ఇవ్వడంతో నాలుక కరుచుకోవడం సదరు మీడియా వంతైంది.